ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్టర్ ఆయనే… ఇక గురు శిష్యుల పోటీ


మహా నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ నిర్మించనున్న సినిమాకి దర్శకుడు ఎవరో తెలిపోయింది. కొన్నాళ్లుగా అందరూ అనుకుంతున్నట్లే ఈ సినిమాకు దర్శకుడు తేజ పేరు ఒకే చేశారు. ఈ విషయాన్ని తేజా వెల్లడించారు. ‘ఎన్టీఆర్ బయోపిక్’ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుందని తన ఫేస్‎బుక్ ‎పేజీలో తేజా పోస్ట్ పెట్టారు. ఇటీవల ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విజయంతో తేజా మంచి జోరు మీదున్నారు.

కాగా ఇప్పటికే లక్ష్మిస్ ఎన్టీఆర్ పేరుతో తేజా గురువు రాంగోపాల్ వర్మ ఒక సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు బాలయ్య తీసే సినిమాకి తేజా దర్శకత్వం వహిస్తుండడం ఆసక్తి కలిగిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో గురు శిష్యులకు పోటీ ఏర్పడనుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినీ రాజకీయ ప్రస్థానంలో ఎన్టీఆర్ ఎదుర్కొన్న పలు సవాళ్లు, విజయాలను తేజా తన సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించనున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *