త‌ప్పుడు ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసిన‌ బీజేపీ మ‌హిళానేత‌

బీజేపీ మ‌హిళా నేత చేయ‌కూడ‌ని త‌ప్పు చేశారు. త‌ప్పుడు ఫొటోను ట్విట్ట‌ర్‌లో పెట్టి కొత్త వివాదానికి తెర‌లేపారు. చిక్కుల్లో ప‌డ్డారు. నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమబంగాలో ఉద్రిక్త ప‌రిస్థితులు ఉన్నాయి. అక్క‌డ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్య‌లో బీజేపీ నేత నుపూర్‌శ‌ర్మ త‌న ట్విట్ట‌ర్‌లో కొన్ని ఫోటోల‌ను పోస్టు చేశారు. అవి 2002లో గుజ‌రాత్‌లో జ‌రిగిన అల్ల‌ర్ల‌కు సంబంధించినవి. అయితే ఆమె ప‌శ్చిమ‌బంగాలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌లకు సంబంధించిన‌విగా పేర్కొన్నారు. త‌న ట్విట్ట‌ర్‌లో పశ్చిమ‌బంగాలోని గొడ‌వ‌ల‌పై నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తూ నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నార‌ని పేర్కొది. తాను పోస్టు చేసిన ఫొటోల‌ను చూసి ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లాల‌ని ట్వీట్ చేసింది. అవ‌గాహ‌న లేకుండా పాత ఫొటోల‌ను పోస్టు చేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఆమె పోస్టు చేసిన ఫొటోల‌పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఘాటుగా స్పందించారు. వివాదాల‌కు దారితీసేలాంటి ఫొటోలు పోస్టు చేస్తున్న నుపూర్‌శ‌ర్మ లాంటి నేత‌ల్ని అరెస్టు చేయాల‌ని కోరుతున్నారు. అయితే నుపూర్ త‌న ప‌నిని స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేశారు. అవి గుజ‌రాత్ అల్ల‌ర్ల ఫొటోల‌ని తెలిసే పోస్టు చేశాన‌నీ, ప్ర‌స్తుతం ప‌శ్చిబంగాలో కూడా అలాంటి ప‌రిస్థితులు ఉన్నాయ‌ని చెప్ప‌డం త‌న ఉద్దేశ‌మ‌ని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *