పవన్ కోసం నేనా… అంత సీన్ లేదు… త్రివిక్రమ్ కామెంట్

పవన్ గురించి ఏదైనా చర్చ వస్తే అందులో ఎక్కఫా ఓచోట త్రివిక్రమ్ ప్రస్తావన వుంఫీ తీరుతుంది. త్రివిక్రమ్ పేరు కానీ ఆయన మాటలు కానీ తేకుండా పవన్ కి సంబంధించిన చర్చ ముగియదు. వారిద్దరి మధ్య అంతటి అవినాభావ సంబంధం ఉన్న సంగతి తెలుగు పరిశ్రమలో అందరికి తెలిసిందే. అలాంటి త్రివిక్రమ్ కి ఏమీ తెలియకుండానే ఏమీ చెప్పకుండానే పవన్ పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టారా? అవుననే అంటున్నారు త్రివిక్రమ్. పవన్ పొలిటికల్ స్పీచ్ లన్నీ కూడా త్రివిక్రమ్ రాసి ఇస్తాడని అందరూ చెప్పుకుంటుంటే… ఆయన మాత్రం తనకేమీ సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు.

పవన్ కళ్యాణ్ ఇంకొన్ని సినిమాలు చేస్తే బాగుంటుందని మీరు సలహాలు ఇవ్వలేదా..? అని త్రివిక్రమ్ ని ప్రశ్నించగా.. ‘సలహాలా.. భలేవారండీ. సలహాలు ఇచ్చేంత సీన్ ఉందా..?’ అని అన్నాడు. రాజకీయాల్లోకి వెళ్తున్నప్పుడు పవన్ మీకేమైనా చెప్పారా..? అనే ప్రశ్నకు సమాధానంగా.. ‘నాకెందుకు చెబుతారు. ఆయన తన అన్నయ్యకే ఏం చెప్పడు. ఓ స్నేహితుడిగా ఇప్పటికీ నేను ఆయనతో టచ్ లో ఉన్నాను.

ఆయన రాజకీయ ప్రసంగాలు నేను రాస్తున్నానని అంటున్నారు. నా స్క్రిప్ట్ లు రాసుకోవడానికే నాకు బద్ధకం ఎక్కువ. ఇక రాజకీయ ప్రసంగాలు ఎలా రాస్తాను. నాకు రాజకీయాలకి బాగా దూరం. నిజానికి నేను టీవీ చూడను, పేపర్లు చదవను.. ఇక రాజకీయాలేం తెలుస్తాయి’ అంటూ త్రివిక్రమ్ తేల్చిపారేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *