పవన్… ఈ ఫోటోలేంటి…? ఏపీలో అలజడి కుట్రకు సాక్ష్యం..!

“రాష్ట్రవ్యాప్తంగా పవన్ కల్యాణ్ కోసం చస్తాం. చంపుతాం అనే యువత ఎంతలేదన్నా ఒక 10 నుంచీ 20 వేల మంది ఉంటారు. పవన్‌కి వ్యతిరేకం అనుకుంటున్న మీడియా మీద.. పవన్ కల్యాణ్‌కి ఇష్టం లేని మనుషుల్ని అటాక్ చెయ్యడానికి, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలజడి సృష్టించడానికి పవన్ కల్యాణ్ చేస్తున్న కుట్ర ఇది. మీడియా ప్రముఖుల పేర్లు, ఫోటోలు బయటపెట్టి బెదిరించడం వెనక. నాలాంటి వాళ్ళ ఇంటి అడ్రస్సులు వాళ్ల చెంచాల ద్వారా బయట పెట్టించడం వెనక ఇదే కుట్ర ఉంది” అని పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ సంచలన ట్విట్ చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ఇద్దరు యువకులతో దిగిన పిక్‌ను పోస్ట్ చేసి వాళ్లిద్దరు తనపై కోడిగుడ్లతో దాడికి పాల్పడిన వాళ్లంటూ కత్తి మహేష్ పేర్కొన్నారు. త్వరలో పవన్ తన అభిమానులతో రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం సృష్టించబోతున్నారని.. అప్పుడు రాష్ట్రంలో తలెత్తే పరిస్థితులు ఇలా ఉంటాయంటూ జోస్యం చెప్పారు.

‘‘ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు నా మీద కోడిగుడ్లతో దాడి చేసిన యువకులు. నా మీద దాడిని ఏనాడూ ఖండించని పవన్ కల్యాణ్ దాడి చేసిన అభిమానులను పిలిచి మరీ అభినందించడం దేనికి చిహ్నం? మొన్నటికి మొన్న ఫిల్మ్ ఛాంబర్‌కి అభిమానుల్ని పిలవడం వెనక దాగున్న మతలబు, అమ్మ సెంటిమెంటుని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలని సాధించడం కాదా!


అభిమానుల కోసం పవన్ అక్కడికి రాలేదు. తన అక్కసు వెళ్లగక్కడానికి. మా అసోషియేషన్‌ను టెర్రరైజ్ చేసి.. మీడియా మీద వార్ ప్రకటించడానికి వచ్చాడు. అభిమానుల ఆవేశాన్ని తన ఆయుధంగా మలుచుకోవడానికి ప్లాన్ వేసుకునే వచ్చాడు. అక్కడ జరిగింది అదే. ఆంధ్రజ్యోతి వాహనాల మీద దాడి. దాడి చేసిన అభిమానుల్ని అరెస్టు చేస్తే, వాళ్ళని విడిపించడం మానుకుని, అది కూడా మీడియా ఆరాచకమే అని కలర్ ఇస్తున్నాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఏకం చేసి, వివిధ ప్రదేశాలలో అభిమానులను రెచ్చగొట్టే ప్రసంగాలని చేయిస్తున్నాడు.


త్వరలోనే పవన్ కల్యాణ్… అభిమానుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం సృష్టించబోతున్నారు. పవన్‌ను పిచ్చిగా అభిమానించే కాపు-దళిత యువకులు ఈ కుట్రలో సమిధలు అవుతారు. చంద్రబాబు ప్రభుత్వం ఇరుకున పడుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధిస్తుంది. మధ్యంతర ఎన్నికలు వస్తాయి. పవన్ కల్యాణ్కింగ్ అవొచ్చు. లేదా కింగ్ మేకర్ అవొచ్చు’’ అని కత్తి మహేష్ ఫేస్‌బుక్‌లో తీవ్రమైన వ్యాఖ్యలతో పోస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *