బీజేపీకి చెక్… పవన్ తోనే పవర్ పంచుకోనున్న బాబు!?!


ఏపీలో అప్పుడే ఎన్నికల పొత్తులు పూస్తున్నాయి. నేరుగా ఎవరు బయటకి చెప్పకపోయినా వారి మాటల అంతరార్ధం బట్టి ఎవరు ఎవరి జట్టులో ఉంటారో తెలిసిపోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ టీడీపీ కాపురం అంతంత మాత్రంగానే సాగుతోంది. అధికార పార్టీ నేతలంతా ముఖ్యంగా మంత్రులు పవన్ ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు మాత్రం పవన్ ని పల్లెత్తు మాట అనవద్దంటు హెచ్చరికలు చేస్తున్నారు.

అటు జనసేన నేతలేమో బాబుతో మిత్రత్వం పోయిన ఎన్నికలతోనే ముగిసిందంటూ ప్రకటనలు చేస్తున్నారు. పవన్ కూడా ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలను పట్టించుకోవద్దు అంటూ తన కేడర్ను అదుపు చేస్తున్నారు. సేమ్ టూ సేమ్ బాబు… పవన్ ఒకే ప్రకటనలు చేస్తున్నారు. దీన్నిబట్టి తెలిపోవడం లేదూ ఎవరు ఎవరితో జట్టు కట్టబోతున్నారో.

వాస్తవానికి టీడీపీ అధినేతకు… జనసేన సారధికి ఒక క్లారిటీ ఉంది. వచ్చే ఎన్నికల్లో తాము ఎవరితో కలిసి వుంటామో అనే విషయంలో స్పష్టత ఉంది. కేడర్ లోనే కన్ఫ్యూజన్ అంతా. అందుకే వారు బావోద్వేగానికి గురై ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. అధినేతలతో చివాట్లు తింటున్నారు.

నిజానికి పవన్‌తో రాజకీయ మైత్రి కొనసాగించడానికి తాను ఆసక్తిగా ఉన్నానన్న సంకేతాలను సమయం వచ్చినప్పుడల్లా బాబు ఇస్తూనే ఉన్నారు. అయితే నేతలే అర్ధం చేసుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు పోయిన రాష్ట్రంలో పవన్ తో కలిసి వెళ్ళాలి అన్నది బాబు ఆలోచనగా తెలుస్తుంది. ఇక పవన్ కూడా తన అభ్యంతరాలన్ని బీజేపీ పైనే తప్పించి చంద్రబాబు మీద కాదన్న విషయం వీలు చిక్కినప్పుడల్లా బయటపెడుతూనే వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *