ప‌య్యావుల‌ను కేసీఆర్ బుక్ చేశారా? బాబు గుస్సా ఎందుకంటే?


ప‌రిటాల ర‌వి కుమారుడి వివాహానికి వెళ్లిన కేసీఆర్ అక్క‌డ చేసిన సీన్‌పై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. పెళ్లికి వెళ్లిన కేసీఆర్ పెళ్లి చూసి రాకుండా… అక్క‌డ టీడీపీ నేత‌ల‌తో ఎంతో సంఖ్య‌త క‌న‌బ‌రుస్తూ చేసిన సీన్ ఇప్పుడు టీడీపీలో కొంత గంద‌ర‌గోళానికి కార‌ణ‌మైంది. పెళ్లిలో త‌న‌ను ప‌ల‌కరించిన ప‌య్యావుల కేశ‌వ్‌ను కేసీఆర్ పిలిపించుకుని మ‌రీ ప‌క్క‌కి తీసుకెళ్లి మాట్లాడి స‌న్సెష‌న్ సృఫ్టించారు. ఆయ‌న అలా మాట్లాడ‌డంతో ఒక్క‌సారిగా మీడియా మొత్తం అల‌ర్ట్ అయ్యింది. త‌న‌కు తోచిన రీతిలో క‌థ‌నాలు వండి వార్చింది. అలా కేసీఆర్ చేసిన చిన్న ప‌ని అటు తెలంగాణ‌లో ఇటు ఏపీలోని తెలుగుదేశం పార్టీలో క‌ల‌క‌లం రేపింది.

తెలంగాణ నేత‌లైతే అక్క‌డ కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా చావో రేవో అన్న‌ట్లుగా పోరాడుతున్నారు .ఇలాంటి త‌రుణంలో కేసీఆర్‌తో ప‌య్యావుల ర‌హ‌స్య చ‌ర్చ‌లు ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు పంపాయ‌ని తెలంగాణ నేత‌లు చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేశారు. దాంతో చంద్ర‌బాబు కూడా నిన్న జ‌రిగిన పార్టీ స‌మావేశంలో ప‌య్యావుల‌దే త‌ప్ప‌న్న‌ట్లుగా మాట్లాడి… ఆయ‌న‌పై ఒకింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో బాగా నొచ్చుకున్న ప‌య్యావుల టీడీపీ రాష్ట్ర కార్యాల‌యానికి ఫోన్ చేసి త‌న గోడు వెళ్ల‌బోసుకున్నారు. ఇందులో త‌న త‌ప్పేం ఉందో అర్థం కావ‌డం లేద‌ని పార్టీకి చెడ్డ‌పేరు తెచ్చే ప‌ని తానెప్పుడూ చేయ‌న‌ని, కేసీఆర్ ఒక పోలీసు అధికారితో పిలిపించ‌డంతో అక్క‌డ‌కు వెళ్లాన‌ని కానీ ఆయ‌న అలా ప‌క్క‌కు తీసుకెళ్తార‌ని త‌న‌కు తెలియ‌ద‌ని అంద‌రు టీడీపీ నేత‌ల మాదిరే తాను కూడా పెళ్లికి వ‌చ్చాన‌ని చెప్పుకొచ్చారు. ఎవ‌రో చంద్ర‌బాబుకు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని దాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని త‌న‌పై అభాండాలు వేయ‌వ‌ద్ద‌ని కోరారు.

అయితే, కేసీఆర్ మాత్రం భారీ వ్యూహంతోనే ఆ చిన్న ట్రిక్ ప్ర‌ద‌ర్శించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌రిటాల కుమారుడి పెళ్లికి వెళ్ల‌డం వ‌ల్ల త‌న రాష్ట్రంలో వ‌చ్చే వ్యతిరేక‌త‌ను, ఇక్క‌డి టీడీపీ నేత‌లు త‌నపై మండిప‌డ‌తార‌ని ముందే ఊహించిన కేసీఆర్ దాన్నుంచి చ‌ర్చ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌డం కోస‌మే ఈ ఎత్తు వేశార‌ని తెలుస్తోంది. అక్క‌డికి వెళ్లాక టీడీపీ నేత‌ల‌తో తాను స‌ఖ్య‌త‌గా ఉండి ఏదో సీన్ క్రియేట్ చేస్తే ఇక్క‌డి టీడీపీ నేత‌ల‌కు త‌న‌పై విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం ఉండ‌ద‌ని అలా చేసినా మీ నేత‌ల‌తోనే కేసీఆర్ మాట్లాడుతున్నారు… మీరు మీరు ఒక్క‌టే క‌దా అని ప్ర‌జ‌లు టీడీపీ నేత‌ల విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోర‌ని త‌ద్వారా తాను సేఫ్‌గా ఉండొచ్చ‌ని ఆయ‌న భావించి ఉంటార‌ని రాజ‌కీయంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఏది ఏమైనా ఈ మొత్తం ఉదంతంలో ఎదురు ప‌డిన కేసీఆర్‌కు ఒక చిన్న న‌మ‌స్కారం పెట్టినందుకు కేశ‌వ్‌ను కేసీఆర్ ఫుల్‌గా బుక్ చేసేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *