పింఛను అడిగితే అరెస్టులా… సర్కారును దునుమడిన ఎంఎల్సీలు

సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎక్కడికక్కడ అరెస్టులకు దిగింది. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. దీనిపై ఉపాధ్యాయ లోకం మండిపడింది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేయడాన్ని వారు గర్హించారు.

ఇక ప్రభుత్వ దమనకాండను ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) నేతలు తీవ్రంగా ఖండించారు. పింఛను ఇవ్వమని కోరితే అరెస్టు చేస్తారా? అని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉపాధ్యాయులు తమకు పాత పింఛను విధానాన్నే అమలు చేయాలని ఆరు నెలలుగా పోరాడుతున్నారు. ప్రభుత్వం తన విధానం ఏమిటో చెప్పలేదు. శాసనమండలి చివరి రోజున ప్రకటన చేస్తామన్నారు.

మనసుంటే ముందుగా ప్రకటించి ఉండొచ్చు’ అని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, యండపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. ప్రభుత్వం మీద నమ్మకం లేకనే ఉపాధ్యాయులు ‘చలో అసెంబ్లీ’ బాట పడుతున్నారని, అరెస్టులకు పూనుకోవడం, అడ్డుకోవడం, రాత్రిపూట పోలీసు స్టేషన్లలో కూర్చోబెట్టడం అన్యాయమని ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *