పవన్ పై కేసు… సీసీఎస్ పోలీస్ స్టేషన్లో నమోదు

జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కళ్యాణ్ మీద పోలీస్ కేసు నమోదైంది. ఆయన, ఆయన అనుచరులపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాజమాన్యం హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్‌మీడియాలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తప్పుడు ప్రచారం చేయడంతో పాటు వ్యక్తులను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. మీడియాపై పవన్ కల్యాణ్ ధోరణిని ఎండగడుతూ జర్నలిస్ట్ సంఘాల నేతలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి మద్దతుగా నిలిచారు.

మీడియాపై పవన్ కల్యాణ్ బెదిరింపు ధోరణి సరైనది కాదని, తన ధోరణి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాత్రికేయులు హెచ్చరించారు. ఒక మీడియాను టార్గెట్ చేస్తే మిగిలిన వాళ్లు సైలెంట్‌గా ఉండడం మంచిది కాదని, పవన్ చేస్తున్న దాడి అన్ని మీడియా సంస్థలకూ వర్తించే విధంగా ఉందని, ఈ విషయంపై అందరూ కలిసికట్టుగా పోరాడాలని జర్నలిస్ట్ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.


మరోవైపు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి జర్నలిస్టుల సంఘాల నేతలు మద్దతు పలికారు. మీడియాపై దాడికి నిరసనగా అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం అసన్నమైందని పిలుపు ఇచ్చారు. మీడియాను బెదిరించే ధోరణిలో పవన్ కల్యాణ్ వ్యవహరించడం సరైంది కాదని జర్నలిస్టుల సంఘాల నేతలు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *