ఆ పిసిసి చీఫ్ కు సీటు ఇవ్వొద్దు… హైదరాబాద్ లో కాంగ్రేస్ నేతల ధర్నా

 

తెలంగాణ ఎన్నికల్లో టిఆర్ఎస్ కి గట్టి ప్రత్యర్థిగా నిలబడ్డ కాంగ్రెస్ లో అసమ్మతి రోడ్డెక్కుతుంది. సీట్ల పంపకాలు విషయంలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు అసంతృప్తులు బెడద తప్పలేదు. కాంగ్రెస్‌ పార్టీ జనగామ అసెంబ్లీ టికెట్‌ను మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు ఇవ్వొద్దని కోరుతూ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ ఎదుట బుధవారం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేశారు.

చేర్యాల మండలం వీరన్నపేటకు చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో జనగామ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ వేమళ్ల సత్యనారాయణరెడ్డితో పాటు పలువురు తాజా మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు ఈ నిరసనకు నాయకత్వం వహించారు. ఈ మేరకు పొన్నాలపై ఫిర్యాదు చేసినట్లు మొగుళ్ల రాజిరెడ్డి చెప్పారు.

పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజల గురించి నాలుగేళ్లుగా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 75సంవత్సరాల వయసు ఉన్న ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దని, ఇస్తే పార్టీ నష్టపోవాల్సి వస్తుందని నేతలను కోరారు. పార్టీ కోసం పనిచేసే వారికి టికెట్‌ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని ఆ ఫిర్యాదులో వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *