పోసాని నువ్వు సూపర్… నీ కళా హృదయం భేష్

సినిమా ఇండస్ట్రీలో పోసాని కృష్ణ మురళీది డిఫరెంట్ స్టైల్. ఆయన నటన ఎంతో వైవిధ్యం. ఇక సామాజిక అంశాలలో పోసాని స్పందించే తీరు అమోఘం. పోసానిని మరోసారి తలచుకుని హ్యాట్సాఫ్ చెప్పే సంఘటన ఒకటి మంగళవారం జరిగింది.

ఓ మురికి వాడలో రేకుల షెడ్ఫులో దుర్భర దరిద్రాన్ని అనుభవిస్తున్న కిన్నెర కళాకారుడు మొగులయ్య గురించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓ కధనాన్ని ప్రసారం చేసింది. ‘కిన్నెర కన్నీరు’ పేరిట వచ్చిన ఆ కథనానికి చలించిపోయిన పోసాని కృష్ణ మురళీ మొగులయ్యకు రూ. 25 వేల ఆర్థికసాయం అందజేశారు. ఏబీఎన్‌ స్టూడియోకి తీసుకువచ్చిన మొగులయ్యను పోసాని దంపతులు సన్మానించారు. మొగులయ్య పరిస్థితిని ప్రపంచానికి చూపిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి పోసాని ధన్యవాదాలు తెలిపారు.

మొగులయ్య లాంటి కళాకారులను కాపాడుకోవాలని అన్నారు. కళ అంతరించపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జీవితాంతం మొగులయ్యను ఆదుకుంటానని పోసాని హామీ ఇచ్చారు. మొగులయ్యకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వాలని మీడియా ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *