లోకేష్ మంత్రి కావడం మన కర్మ: పోసాని

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ రంగం నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ఇప్పటికే గుణ శేఖర్, బన్నీ వాసు వంటి వారు అవార్డులపై మండి పడగా తాజాగా నటుడు పోసాని కృష్ణమురళి కూడా ఘాటుగా స్పందించాడు. తనకు ఇచ్చిన నంది అవార్డును తిరస్కరిస్తున్నానన్న పోసాని నారా లోకేష్ పై ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఐవీఆర్ఎస్ ద్వారా అవార్డులు ఇస్తామనడాన్ని పోసాని సమర్థించారు. అలా చేయడం ద్వారా తనకు అవార్డు రాకపోయినా బాధపడనని అన్నారు.

నంది అవార్డుల గురించి మంత్రి లోకేష్ అన్న మాటలపై స్పందిస్తూ తాము ఎన్నారైలు అయితే లోకేష్ ఎవరని పోసాని ప్రశ్నించారు. లోకేష్ కు ఉన్న మనస్తత్వం తెలంగాణ వారికి ఉంటే తమని తరిమి కొట్టే వారని, కాని వారు అలా చేయలేదని తెలంగాణ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు.

అసలు నారా లోకేష్ మంత్రి కావడం ఖర్మ అని పోసాని అన్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అయితే తాము తెలుగు రోహింగ్యాలమవుతామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇచ్చిన నంది అవార్డులను రద్దు చేసి సర్వే ద్వారానే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *