పిహెచ్ డి కోసం వెళ్తే… పరువం పంచమన్నాడు…!

ఆమె ఉన్న‌త చ‌దువుల కోసం ఇరాన్ నుంచి వ‌చ్చింది. పీహెచ్‌డీ సీటు ఇవ్వాల‌ని ఓ ప్రొఫెస‌ర్‌ను కోరింది. త‌న కోరిక తీరిస్తే సీటు ఇస్తాన‌ని అన్నాడు. ఈ ఘ‌ట‌న సంచల‌నం సృష్టిస్తోంది. ఇరాన్ కు చెందిన 31 ఏళ్ల మహిళ పీజీ పూర్తి చేసుకుంది. అకౌంట్స్‌లో పీహెచ్‌డీ చేసేందుకు మహారాష్ట్రలోని పుణేకు వ‌చ్చింది.

యశ్వంతరావు మొహితే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్సు అండ్ కామర్స్ కళాశాలకు వెళ్లింది. ఆమె ఈ నెల 8వతేదీన ప్రొఫెసర్ శివాజీ బొర్హాడే (53) ని క‌లిసింది. తనకు పీహెచ్‌డీ సీటు ఇవ్వాలని కోరింది. తనతో లైంగిక సంబంధం పెట్టుకొని తన కోరిక తీరిస్తే పీహెచ్‌డీ సీటు ఇస్తానని ప్రొఫెసర్ చెప్పారు. దాంతో ఆమె షాక్‌కు గురైంది. వెంటనే ప్రొఫెసర్ గదిలోనుంచి బయటకు వచ్చి తన గదిలోకి వెళ్లింది. స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడింది. తన కోరిక తీర్చమన్న ప్రొఫెసరుపై పూణే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రొఫెసరు శివాజీ బొర్హాడే పై ఐపీసీ సెక్షన్ 354 (ఎ) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో శివాజీ బొర్హాడే తన నేరాన్ని అంగీకరించి క్షమాపణలు చెప్పాడు. కళాశాలలో సీనియర్ ప్రొఫెసర్ అయిన శివాజీ బొర్హాడే ఇద్దరు అమ్మాయిలకు తండ్రి. ఆయ‌న ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రొఫెసర్ తీరుపై పలువురు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *