మోడీకి జై కొట్టింది 43 శాతమే… ఇక రాహుల్ వంతు


బావి ప్రధానిగా రాహుల్ కే ఓటేసిన తెలంగాణ

దేశంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం వచ్చింది. తెలంగాణలో ముందస్తు నగారా మోగింది. ఈ క్రమంలోఓ తెలుగు ఛానల్ కోసం ఫ్లాష్ టీమ్ ఆ రాష్ట్రంలో సర్వే నిర్వహించింది. ఈ సర్వే మోడీకి షాక్ ఇచ్చింది. మోడీ గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది. మోడీ పని తీరుపై మెజారిటీ ప్రజలు పెదవి విరిచారు. మోడీ తెలంగాణకు న్యాయం చేయలేదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ప్రధానిగా మోడీకంటే రాహుల్ కే ఎక్కువ మంది ఓటేశారు.

 

మోడీ పాలన బాగుందని 43.01 శాతం మంది అభిప్రాయపడ్డారు. 56.99 శాతం మంది బాగాలేదని పేర్కొన్నారు. మోడీ సర్కారు తెలంగాణకు న్యాయం చేసిందా అంటే 61.40 శాతం మంది అన్యాయం చేసిందని అభిప్రాయపడ్డారు. 38.6 శాతం మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు. ప్రధానిగా తెలంగాణ ప్రజలు రాహుల్ కే మద్దతు తెలిపారు.భావి ప్రధానిగా ఎవరు బెస్ట్ అంటే 41.33 శాతం మంది రాహుల్ గాంధీకి ఓటేశారు. మోడీకి సానుకూలంగా ఓటేసింది 35.10 శాతం మంది మాత్రమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *