రవితేజ న్యూ లుక్ రివీల్…. అంధుడిగా అదరహో అనిపిస్తాడా..?

మాస్ హీరోగా… తన అభిమానులతో మాస్ మహరాజ్ గా పిలిపించుకునే రబితేజ కొత్త సినిమా పోస్టర్ వచ్చేసింది. రెండు రోజుల్లో స్వతంత్ర దినోత్సవం నాడు టీజర్ విడుదల కానున్న రాజా ది గ్రేట్ సినిమా న్యూ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్తచిత్రం ‘రాజా ది గ్రేట్’. దిల్‌రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈచిత్రంలో రవితేజ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలో రవితేజను ముందెన్నడూ చూడనటువంటి కొత్తఅవతారంలో చుపిస్తున్నామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. చిత్ర దర్శకుడు అనిల్ రావుపూడి కూడా రాజా కొత్త అవతారంలో వస్తున్నాడంటూ ట్వీట్ పెట్టాడు.

అనిల్… దిల్ రాజు మాటలను బట్టి ఈ సినిమాలో రవితేజ అంధుడి పాత్రలో నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అతిత్వరలో విడుదలచేయాలని సన్నాహాలు చేస్తున్న ఈచిత్రం రవితేజ ఈసినిమాతో పాటు రవితేజ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రాశిఖన్నా, సీరత్ కపూర్‌లతో జంటగా ‘టచ్ చేసి చూడు’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *