ఎంత సక్కాగున్నవే… సరికొత్త సంచలనం…!

టాలీవుడ్ లేటెస్ట్ సంచలనం రంగస్థలం మూవీలోని ఎంత సక్కాగున్నవే పాట కొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేవి శ్రీ సంగీతంతో హోరెత్తిన ఈ పాట పూర్తి వీడియో యూ ట్యూబ్‌లో ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆతృత ప్రేక్షకుల్లో ఏర్పడింది. వీరి ఆతృతను తెరదించుతూ ఏప్రిల్ 26న   చిత్రంలోని ‘‘ఎంత సక్కగున్నావే..’’ వీడియో సాంగ్‌ని యూ ట్యూబ్‌లో విడుదల చేశారు.


చంద్రబోస్ రాసిన ఈ పాట చిత్రంలోని అన్ని పాటల్లోకెల్లా స్పెషల్ అనే టాక్ అంతకుముందే వచ్చింది. ఈ పాటను యూ ట్యూబ్‌లో అలా వదిలారో లేదో జోరు మొదలయింది. ఇప్పటికే దాదాపు 21 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టి ట్రెండింగ్ అయింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పాటను మీరూ చూసి ఎంజాయ్ చేసేయండి.


సుకుమార్ సృష్టించిన ‘రంగస్థలం’ సినిమా రికార్డుల మోత మోగిస్తూ బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. చిత్రంలో చిట్టిబాబుగా రామ్‌చరణ్, రామలక్ష్మిగా సమంత ఎప్పటికీ మరచిపోలేని అభినయాన్ని కనబర్చారు. చెర్రీ- సమంతల కెమిస్ట్రీ, పల్లెటూరి నేపథ్యంలో మంచి స్టోరీ.. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *