అక్క‌డ టెంప‌ర్ హీరో ఫిక్స్‌

ఎన్టీఆర్ , పూరీ జ‌గ‌న్నాథ్‌ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన టెంప‌ర్ అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ కెరీర్‌లోని మంచి సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తార‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. దానికి సంబందించిన చ‌ర్చ‌లూ కొన‌సాగుతున్నాయి. సినిమా రీమేక్ ఖాయ‌మైంది. అంతేకాదు సినిమాకు హీరో కూడా ఫిక్స‌య్యారు.
మాస్ యాక్ష‌న్ సినిమాల‌కు పేరుగించిన రోహిత్‌శెట్టి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. బాలీవుడ్ హీరో ర‌ణ‌వీర్‌సింగ్ ఎన్టీఆర్ పాత్ర‌లో అభిమానుల‌ను అల‌రించ‌బోతున్నాడు. ర‌ణ‌వీర్ ప్ర‌స్తుతం సంజ‌య్ బ‌న్సాలీ తీస్తున్న ప‌ద్మావ‌తి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్త‌వ‌గానే టెంప‌ర్ సెట్స్‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *