*ఔరంగ‌జేబు, గాడ్సేల‌కంటే చంద్ర‌బాబు నీచ‌మైన వ్య‌క్తి *


వైసీపీ ఎమ్మెల్యే రోజా మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌నాస్ర్తాలు సంధించారు. త‌ప్పు చేసిన వారికి కోర్టులో న్యాయ‌మూర్తి శిక్ష వేస్తే .. ప్ర‌జాకోర్టులో ప్ర‌జ‌లే తీర్పు ఇస్తార‌ని అన్నారు. 600 హమీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన చంద్ర‌బాబులాంటి వ్య‌క్తిని నంద్యాల ఓట‌ర్లు న్యాయ‌మూర్తి స్థానంలో కూర్చొని ఉరితీయాల‌ని తీర్పు చెప్పినా త‌ప్పులేద‌ని జ‌గ‌న్ అన‌డంలో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబు మోసాల్ని ప్ర‌శ్నించిన త‌మ అధినేత జ‌గ‌న్‌పై అధికార‌పార్టీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేయ‌డం హాస్యాస్పదంగా ఉంద‌ని అన్నారు. టీడీపీ నేత‌ల‌కు ఏ మాత్రం నైతిక విలువ‌లు లేవ‌ని , వాళ్ల‌కు జ‌గ‌న్‌ను విమ‌ర్శించే అర్హ‌త లేద‌ని అన్నారు. తండ్రిని చంపిన ఔరంగ‌జేబు, గాంధీని చంపిన గాడ్సేల‌కంటే చంద్ర‌బాబు నీచ‌మైన వ్య‌క్తి అని ఆయ‌న మామ ఎన్టీఅరే స్వ‌యంగా చెప్పార‌ని రోజా అన్నారు. చంద్ర‌బాబునాయుడు కుట్ర‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అని, ఈ విష‌యాన్ని చిన్న‌పిల్ల‌వాడిని అడిగినా చెబుతార‌ని చెప్పారు. రోజా చ‌నిపోయిందంటూ కొంత‌మంది సామాజిక మాద్య‌మాల్లో ప్ర‌చారం చేయ‌డాన్ని ఆమె త‌ప్పుబ‌ట్టారు. ఉన్మాదుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్న మంత్రుల‌కు నంద్యాల ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పాల‌ని కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *