ఆరుగురు భార్యలతో విలాసం… అందులో ఒకరు సినీ నటి

అనుభవించు రాజా… అన్న పదానికి అర్థం ఈ రౌడీ షీటర్. జీవితం ఉన్నది అనుభవించడానికి అన్నట్లు ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు భార్యలతో విలాసాలు చేసాడు బుల్లెట్ నాగరాజన్. ఆ అరుగురు భార్యాల్లో ఒక సినీ నటి కూడా ఉండడం విశేషం. తమిళనాడులో పోలీసు ఉన్నతాధికారులను ఫోన్‌లలో బెదిరించి అరెస్టయిన పేరుమోసిన రౌడీ బుల్లెట్‌ నాగరాజన్‌ విలాసవంతమైన జీవితం చూసి పోలీసులే నివ్వెర పోయారు. సినీ సహాయనటి సహా ఆరుగురు భార్యలతో గడిపాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. తేని జిల్లా పెరియకుళం ప్రాంతానికి చెందిన రౌడీ బుల్లెట్‌ నాగరాజన్‌ (50)పై పలు హత్య, దోపిడీ కేసులున్నాయి. ఇటీవల నాగరాజన్‌ మదురై జైళ్ల శాఖ మహిళా ఎస్పీ ఊర్మిలకు, పెరియకుళం తెన్‌కరై మహిళా సీఐకి మూడు నాలుగు సార్లు ఫోన్‌ చేసి బెదిరించాడు.

తేని జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను తీవ్రంగా విమర్శిస్తూ ఆడియో టేపులను సైతం విడుదల చేశారు. తనను పోలీసులు పట్టుకోలేరంటూ సవాలు విసిరాడు. సుమారు వారం రోజులపాటు సంచలనం చేసిన బుల్లెట్‌నాగరాజన్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు సోమవారం మధ్యాహ్నం పెరియకుళంలో దాగి ఉండగా పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుండి కోటి రూపాయల విలువైన నకిలీ కరెన్సీ, రెండు కత్తులు, రెండు డమ్మీ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో దోపిడీ సొమ్ముతో బుల్లెట్‌ నాగరాజన్‌ సినీ సహాయనటి సహా ఆరుగురిని రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తెలిసింది.

పలువురు మహిళలను కూడా పెళ్లిచేసుకుంటానని మోసగించినట్టు కనుగొన్నారు. ఈ వివరాలనువెలికి తీసేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బుల్లెట్‌ నాగరాజన్‌ను మంగళవారం సాయంత్రం పోలీసులు వేలూరు జైలుకు తరలించారు. ఆ సమయంలో అతడు ఖైదీ దుస్తులు వేసుకునేందుకు అంగీకరిచలేదు. ఆ సందర్భంగా పోలీసులతో అతడు గొడవపడ్డాడు. దీంతో పోలీసులు అతడిపై తీవ్రంగా ఒత్తిడి చేసి చివరకు ఖైదీ దుస్తులు ధరింపజేసి జైలులోకి పంపారు. ఈ సంఘటన కారణంగా జైలు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *