సమంత… చైతు పెళ్లి ఎప్పుడో అయిపోయింది..!

అక్కినేని నట వారసుడు నాగ్ చైతన్య… సక్సెస్ ఫుల్ హీరోయిన్ సమంత పెళ్లి ఐపోయింది. కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తెలుతున్న వీరి పెళ్లి కోసం టాలీవుడ్ జనం… అక్కినేని అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో సమంత సరికొత్త సంగతి చెప్పారు.

చైతూతో తనపెళ్లి ఎప్పుడో జరిగిపోయిందని సమంత పెట్టిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. దీనితో జనమందరిలో ఆసక్తి రేగింది.

ఆ ఆసక్తితో ట్వీట్ పూర్తిగా చదివిన వాళ్ళు అమ్మ సమంత అని ముక్కున వేలేసుకున్నారు. “టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వైభవంగా జరిగేలా మా పెళ్లిఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ నెలలో పెళ్లి జరగనుంది. కానీ మానసికంగా నాకు చైతూ తో ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది” అంటూ అదే ట్వీట్లొ సమంత వివరణ ఇచ్చింది.

గోవాలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అక్టోబర్ 6 న జరిగే ఈ పెళ్ళికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారని సమాచారం. ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం వేద వాయిద్యాలతో హైదరాబాద్ లో అత్యంత వైభవంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడట నాగార్జున.

పెళ్లి అనంతరం వీరిద్దరూ 40 రోజులపాటు హానీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారు. ‘మేము చాలా జోష్ లో ఉన్నాం.. మా యాత్ర చాలా సుదీర్ఘంగా అత్యంత సరదాగా సాగిపోతుందని’ సమంత పేర్కొందని ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *