తల్లి కాబోతున్న సానియా మీర్జా…!

టెన్నీస్ సంచలనం, గ్రాండ్ స్లామ్స్ విజేత సానియా మీర్జా శుభవార్త చెప్పారు. తమ ఇంటికి త్వరలో మరో వ్యక్తి రాబోతున్నారని ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని వివాహం చేసుకున్న ఈ హైదరాబాదీ క్రీడాకారిణీ తాను గర్భవతి అయినట్లు ప్రకటించింది.


2010లో హైదరాబాదీ సాంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. తాజాగా ట్విట్టర్ వేదిగా తమ ఇంటికి మరో వ్యక్తి రానున్న విషయాన్ని ఈ జంట ప్రకటించారు. వీళ్లు మీర్జామాలిక్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఓ వినూత్న ఫోటోని పోస్ట్ చేశారు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో తమకు సంతానం పుడితే ఆ బిడ్డ ఇంటి పేరు మీర్జా మాలిక్ అని పెడుతామని సానియా ప్రకటించింది.

అదే మాటపై తమ సంతానానికి మీర్జా మాలిక్ అనే ఇంటి పేరు పెడుతున్నట్లు వీరి తాజా పోస్ట్‌లు చూస్తే స్పష్టం అయింది. ప్రస్తుతం సానియా దంపతులు ప్రకటించిన ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తమ అభిమానుల క్రీడాకారులు త్వరలో తల్లిదండ్రులుగా మారుతున్నారని తెలిసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

సానియా, షోయబ్‌ల జంటను అభినందిస్తూ.. ట్వీట్లు, కామెంట్లు చేస్తున్నారు. గత కొంత కాలంగా సానియా, షోయబ్‌లు విడిపోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరు తమ సంతానానికి సంబంధించిన ప్రకటన చేయడంతో ఆ వార్తలకు చెక్ పడినట్లైంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *