నీ చెస్ట్‌… నా చెస్ట్ ఒక్క‌టే కదా… ఇది సానియా మాట‌!

సెల‌బ్రిటీలు ఏం మాట్లాడినా సంచ‌ల‌న‌మే. ఇక‌, పోలిక‌లు చెప్ప‌డానికి క‌ను, ముక్కు, ముఖం తీరు గురించి చెప్ప‌డం స‌హ‌జం. నీ ముఖ తీరు అచ్చం నాలానే ఉంది అంటూ ఎవ‌రైనా స‌రిపోల్చుతారు. అయితే, టెన్నీస్ తార సానియా మీర్జా మాత్రం స‌రికొత్త పోలిక చేసి ఇప్పుడు అంద‌రి నోళ్ల‌లో హాట్ టాపిక్ అయ్యారు. అయితే, నీ చెస్ట్ నా చెస్ట్ ఒక్క‌టే అంటూ సానియా చేసిన ఆ వ్యాఖ్య‌లు ఆమెకు స‌రికొత్త స్నేహాన్ని తెచ్చి పెట్టింది. బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాతో మంచి స్నేహ బంధం కుదిరేందుకు సానియా చేసిన ఈ వ్యాఖ్య‌లు తోడ్ప‌డ్డాయి.

సానియా మీర్జా… ప‌రిణితి చోప్రా మంచి మిత్రులు. వారిద్ద‌రికీ మ‌ధ్య అంత‌టి గ‌ట్టి బంధం ఏర్ప‌డ‌డానికి కార‌ణం ఏమిటో ఇప్పుడు బ‌య‌ట‌కొచ్చింది. అయితే, ఆ టాపిక్ వెరీ హాట్ విష‌యం కావ‌డంతో ఇప్పుడా విష‌యం వైర‌ల్ అవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పరిణితి చోప్రానే ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. సానియా ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ… తన బయో పిక్ లో పరిణితి చోప్రా అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పేసిందట. దీంతో ఆ వార్త బాలీవుడ్ లో సంచలనాన్ని సృష్టించింది. అయితే, ఆ తర్వాత తానేమైనా నోరు జారానా అని సానియా ఫీలైంద‌ట‌.

వెంట‌నే పరిణితికి ఓ అర్ధరాత్రి ఫోన్ చేసిన సానియా…. ”అనుకోకుండా అలా అనేశాను. నా బయోపిక్‌లో నువ్వు అయితే బాగుంటుంది. మనిద్దరం కూడా చెస్ట్ ఏరియాలో ఆశీర్వదించబడ్డాం. బాగుంటుంది. అందుకే నీ పేరు చెప్పాను అని సానియా చెప్పింది. దానితో ఇద్దరం నవ్వేశాం. ఆ తరువాత ఇండియా వచ్చాక నన్ను కలిసింది. అలా మేం ఫ్రెండ్స్ అయిపోయాం” అని పరిణీతి చెప్పింది. ఇక వారి స్నేహబంధం రోజు రోజుకి బాగా దగ్గరైనట్లు పరిణీత వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *