సంక్రాంతి బ‌రిలో బాబాయి అబ్బాయి

సంక్రాంతికి అగ్ర‌హీరోలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఈసారి మాత్రం ఆ బాబాయి, అబ్బాయిల సినిమాలే హాట్‌టాపిక్‌గా మారాయి. సంక్రాంతి బ‌రిలో ఇద్ద‌రూ త‌ల‌ప‌డుతుండ‌మే ఇందుకు కార‌ణం… ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌, ప‌వ‌న్ కాంబినేష‌న్‌లో సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. అ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు.

రాంచ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమా కూడా సంక్రాంతి బ‌రిలో బాబాయి సినిమాతో సై అంటోంది. వాస్త‌వానికి ప‌వ‌న్ సినిమా సంక్రాంతికి విడుద‌ల అవుతుండ‌డంతో త‌న సినిమాను ముందే విడుద‌ల చేయాల‌ని చ‌ర‌ణ్ భావించారు. డిసెంబ‌రులోనే అభిమానుల‌ను అల‌రించాల‌ని అనుకున్నారు. కానీ తాజాగా ఆయ‌న త‌న వైఖ‌రి మార్చుకున్న‌ట్లు తెలిసింది. పండుగ బ‌రిలో నిల‌వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. బాబాయి సినిమాను ఢీకొట్టేందుకురెడీ అంటున్నాడ‌ని టాక్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *