చైతూతో సమంత ఏ రోజు లవ్ లో పడిందంటే…!?!

టాలీవుడ్ లో వైరల్ అయ్యే వార్తల్లో అగ్రభాగాన వుండే వాటిలో సమంత… నాగ చైతన్య ప్రేమా పెళ్ళి ఒకటి. ఈ వార్తలకు ఉన్న క్రేజీ అలాంటిది. తాజాగా సమంత తన లవ్ మేటర్ లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ ఇద్దరు కలసి నటించిన మొదటిచిత్రం ‘ ఏ మాయ చేసావే’. అయితే ఈచిత్రం షూటింగ్ సమయంలో మొదటిసారి చైతూని చూడగానే ప్రేమలో పడ్డానని, ఆ క్షణం నుండే తనంటే ప్రాణం అని సమంత ఓ ఆంగ్ల మీడియాకు వెల్లడించింది.

‘నా అభిప్రాయాలకు, నాలా నేను ఉండేందుకు సహకరిస్తున్నందుకు కాబోయే శ్రీవారికి, అత్తామామలకు కృతజ్ఞతలు’ అని సమంత తెలిపింది. అంతేకాదు ఎప్పటికీ మేమిద్దరం ఒకరికొకరు తోడుగానే ఉంటాం.. నా జీవితంలో చైతూ కంటే గొప్పది ఏదీ లేదు అని సమంత అన్నారు. ఈ జంట అక్టోబర్ 6న గోవాలో ఒక్కటికాబోతున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *