90 ఏళ్ల వయసులో నటి పిరుదుల మీద చెయ్యేసిన బుష్!


90 ఏళ్ల వయసులో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌ సీనియర్‌ చేష్టలు ఇప్పుడు వివాదస్పదం అయ్యాయి. ఆయన అప్పుడప్పుడు పక్కనున్న మహిళల పిరుదులు తడుముతుండడంపై చర్చ నడుస్తోంది. తాజాగా ఇలాంటి ఉదంతం ఒకటి చోటు చేసుకోవడంతో ఆయన కార్యాలయం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సీనియర్ బుష్ అప్పుడప్పుడూ మహిళల పిరుదులను తడిమే మాట నిజమేగానీ.. ఆయన ఆ పని చేసేది సదుద్దేశంతోనేనని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

జార్జిబుష్‌ తనను దురుద్దేశంతో తాకారంటూ జోర్డానా గ్రోల్నిక్‌ అనే నటి చేసిన ఆరోపణకు వివరణగా బుష్‌ కార్యాలయం స్పందించింది. ఆందోళనతో ఉన్న వ్యక్తులను కాస్త శాంతపరిచేందుకు ఆయన ఎప్పుడూ ఒకే జోక్‌ చెప్పేవారని, అప్పుడప్పుడూ అలా వెనక భాగాన్ని (వెన్ను తట్టిన రీతిలోనే) తాకేవారని వివరించింది. ‘‘ఇప్పుడు బుష్‌ వయసు 93 ఏళ్లు. ఐదేళ్లుగా ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు.

సాధారణంగానే ఆయన చేతులు పక్కన నుంచున్న వారి వీపు కిందకు వస్తాయి. ఈ క్రమంలో తాకడాన్ని కొంతమంది అమాయకత్వంగా మరికొందరు దురుద్దేశంగా భావిస్తారు. ఒకవేళ ఎవరైనా ఆగ్రహం వ్యక్తం చేస్తే వెంటనే ఆయన క్షమాపణ చెప్పేస్తారు’’ అని ఆయన కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *