మగవారికి కూడా లైంగిక వేధింపులు తప్పవ

ఇటీవలి కాలంలో తారా మణులంతా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి, పడ్డ ఇబ్బందుల గురించి గళం విప్పుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే హాట్ బ్యూటీ రాధికా ఆప్టే కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను కూడా లైంగిక వేదింపులకు గురైనట్లు తెలిపింది.

అయితే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఓ సందర్భంలో అలాంటి సమస్యలు ఎదుర్కొన్నా అవకాశాల కోసమే నోరు మెదపకుండా ఉండిపోతున్నారని రాధిక అంది. సినీ రంగంలో తారలుగా ఎదిగేందుకు అన్నిటినీ భరిస్తూ ఉంటారని, కేవలం సినిమా రంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ లైంగిక వేధింపులు ఉన్నాయని ఈ నటి చెప్పుకొచ్చింది.

మహిళలై కాదు లైంగిక వేధింపులు మగవారికి కూడా తప్పవు, పలు సందర్భాల్లో వారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని రాధిక అంది. అయితే ఇలాంటి వాటి పట్ల చూసీ చూడనట్లు వ్యవహరించకూడదని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని నోరు మెదపాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *