ఆ పిల్ల చిందేస్తుంటే…. కోటిన్న‌ర మంది క‌ళ్ల‌ప్ప‌గించి….

జూనియ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమా జై ల‌వ కుశ ట్రైల‌ర్‌ను కోటికి పైగా వీక్షకులు క‌నులారా విక్షించారు. అంత‌కుముందు బాహుబ‌లి…. సహా ప‌లు సినిమాల‌కు ఇలానే మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వాళ్లంటే సినీ హీరోలు. జ‌నంలో వారికున్న క్రేజ్‌ను బ‌ట్టి వారి సినిమాల‌కు, ట్రైల‌ర్ల‌కు యూట్యూబ్‌లో ల‌క్ష‌లు, కోట్ల వ్యూస్ రావ‌డం మామూలే. అయితే, ఓ విద్యార్థిని, త‌న మిత్ర బృందంతో కలిసి స‌ర‌దాగా చేసిన డాన్స్‌కు ఇప్పుడు యూట్యూబ్ వ్యూయ‌ర్స్ వెర్రిలెత్తిపోతున్నారు. ఆ వీడియోను చూస్తూ పూన‌కం వ‌చ్చిన‌ట్లు ఉగిపోతున్నారు. దాంతో కొద్ది రోజుల్లోనే ఆ వీడియో వైర‌ల్ అయిపోయి కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంటోంది. ఎంత‌గా అంటే ఆ వీడియోలో డాన్స్ చేసిన యువ‌తులు సైతం సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోన‌య్యేంత‌గా…

జిమ్మికి క‌మ్మ‌ల్‌… ఓనం పండుగ సంద‌ర్భంగా కొచ్చిలోని విద్యార్థులు కొంద‌రు స‌ర‌దాగా చేసుకున్న నృత్యం. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆన్‌లైన్‌లో ఈ పాట‌ విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ వ‌చ్చాయి. ఇప్పుడా వ్యూస్ సంఖ్య‌ కోటి 18 లక్షలకు పైగా చేరుకుంది. కొచ్చిలో ఉన్న ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ కామర్స్‌ కళాశాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు ఈ పాటలో నటించారు. ఓనం సంప్రదాయ దుస్తులు ధరించి వారు చేసిన డ్యాన్స్‌ యువతకు విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా షెరిల్‌ అనే అమ్మాయి డ్యాన్స్‌కి బాగా పేరొచ్చింది. రెండు వారాలకు ముందే ఆమె ఆ కళాశాలలో చేరింది. ఓనం పండుగకి ఏదైనా భిన్నమైన వీడియోను రూపొందించాలని భావించి అధ్యాపకులు, విద్యార్థులు కలిసి ‘జిమ్మికి కమ్మల్‌’ వీడియోకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడ‌ది యూట్యూబ్‌ను ఊపేస్తుంది.

‘ఇంతటి స్పందన అస్సలు ఊహించలేదు. మంచి కథాపాత్రలు లభిస్తే సినిమాల్లో నటించేందుకు కూడా సిద్ధమే. తమిళ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అయితే ఇంట్లో ఒప్పుకుంటారా అనేది చెప్పలేను. ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేదు’ అంటూ ఆ వీడియోలో డాన్స్ చేసిన షెరిల్‌ చెబుతోంది. ఇక తమిళంలో తనకు అజిత్‌ అంటే బాగా ఇష్టమని షెరిల్‌ చెబుతోంది. ఇక‌, ఒక్క సాంగ్‌తో సోషల్‌ మీడియాలో ఇప్పుడు షెరిల్‌కు ప్రత్యేకంగా అభిమానులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *