డబ్బు కట్టలతో “శిల్పా”… వీడియో విడుదల చేసిన టీడీపీ

నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి అనుచరులు డబ్బులు పంచుతూ తమకు అడ్డంగా దొరికి పోయారని టీడీపీ నేతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను అధికార పార్టీ నేతలు విడుదల చేసారు. నిన్నటి వరకు మాటల దాడి చేసుకున్న రెండు పార్టీల నేతలు పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్ది వ్యూహాలు మారుస్తున్నాయి. ఒకరిపై మరొకరు నిఘా పెట్టుకోవడం మొదలు పెట్టారు. ఇందులో టీడీపీ పై చేయి సాదించినట్లే ఉంది.

శిల్పా అనుచరులు డబ్బులు పంచుతూ దొరికారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. వైసీపీ అధినేత జగన్‌ ఉన్మాది కన్నా హీనంగా మాట్లాడుతున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఎవరు ఎన్ని వ్యూహాలు పన్నినా చంద్రబాబును జగన్ లాంటి వాళ్ళు ఏం చేయలేరని సోమిరెడ్డి అన్నారు.

తనకు టీవీ చానల్… పత్రిక లేదని జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. జగన్ కుట్రలపై మాకు అనుమానాలు ఉన్నాయని, సీఎం చంద్రబాబు ప్రాణాలకు హాని ఉందని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీని గెలిపిస్తాయని సోమిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి అఖిలప్రియ వస్త్రదారణపై వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు చేయడం సరికాదని, రోజా వ్యాఖ్యలతో టీడీపీకే లాభం మంత్రి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *