శిరీష కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే..?

బ్యూటీషియన్‌ శిరీష మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శిరీష అనుమానాస్పద మృతి కేసులో ఇప్పటికే రాజీవ్… శ్రావణ్ లని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా వారిని కస్టడికి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగానే పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే రాజీవ్ ప్రియురాలు తేజస్వినిని కూడా పోలీసులు ప్రశ్నించారు.

ఈ మొత్తం విచారణ తర్వాత కూడా శిరీష మీద అత్యాచారం జరిగిందో లేదో పోలీసులు తేల్చలేక పోయారు. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం శిరీష ని చంపేసి ఆత్మహత్య కథనం వినిపిస్తున్నారని బలంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకం కానుంది. పోలీసులు కూడా ఆమె మీద అత్యాచారం జరిగిందా లేదా అన్న విషయం తెలాలంటే ఫోరెన్సిక్ నివేదిక రావాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇప్పుడు ఆ ఫోరెన్సిక్ నివేదిక వచ్చేసింది. బంజారాహిల్స్‌ పోలీసులకు ఫోరెన్సిక్‌ ప్రాథమిక నివేదిక ఇచ్చారు. శిరీషపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్‌ నివేదికలో తేలింది. శిరీష దుస్తులు, ఒంటిపై మరకల ఆధారంగా ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *