ఆ దర్శకుడు నన్ను బట్టలు విప్పి చూపించమన్నాడు…?!?!

తెలుగు సినీ పరిశ్రమని కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో మరిన్ని దిగ్భ్రాంతి గొలిపే విషయాలు బయటకొస్తున్నాయి. ఆదివారం హైద్రాబాద్లో మహిళా సంఘాలు నిర్వహించిన సదస్సుకు పదుల సంఖ్యలో ఆర్టిస్టులు వచ్చారు. వారంతా తాము అనుభవించిన నరకాన్ని చెప్పుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. అవకాశాల కోసం వెళ్లిన తమని దర్శకులు, కోఆర్డినెటర్లు ఇంకా అనేకమంది ఏ విదంగా హింసించింది వివరించారు.

ఈ చర్చా వేదికలో సోనా రాథోడ్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో జరుగుతున్న అరాచకాలపై ధ్వజమెత్తారు. ‘‘నేను మొదటగా హైదరాబాద్ వచ్చినప్పుడు అమీర్‌పేట్‌లోని 24 ఫ్రేమ్ నటన నేర్పించే ఆఫీస్‌కు నాతో పాటుగా నటి పవిత్ర వెళ్లాం. నేను థర్డ్ జండర్‌గా మారుదామని మా ఇంటి నుంచి 10 వేల రూపాయలు తీసుకొచ్చాను. అక్కడ నాకు పది రోజుల యాక్టింగ్ నేర్పించారు.

ఒక్కరోజు కారెక్టర్ కోసం ఒక అమ్మాయితో ఇద్దరు, ముగ్గురు కో ఆర్డినేటర్స్ గడుపుతున్నారు. ‘మరుపురాని సన్నివేశాలు’ సీరియల్ డైరెక్టర్ సంతోష్ నన్ను నీవు హిజ్రావా కాదా అంటూ.. నన్ను బట్టలు విప్పమన్నాడు’’ అని రాథోడ్ భోరున విలపించారు. సినీ పరిశ్రమలో జరుగుతున్న అరాచకాలపై నటి సోనా రాథోడ్ అల్టిమేటం జారీ చేశారు. తమకు న్యాయం చేయకపోతే నగ్నంగా నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించింది.

ఇక మరోవైపు నటి శ్రీరెడ్డి శనివారం పోలీస్‌స్టేషన్ మెట్లెక్కింది. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరాటి కల్యాణి, ఆర్టిస్ట్ సత్య చౌదరీ తనను అసభ్య పదజాలంతో దూషించారంటూ హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి డిమాండ్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *