మాట్లాడ‌దామ‌ని పిలిస్తే వ‌చ్చిన మ‌ర‌ద‌లుని క్రూరంగా…

ఆ యువ‌తి సొంత‌ బావ‌నే పెళ్లి చేసుకుందామ‌నుకుంది. మాట్లాడాలి రా అని అత‌డు పిలిస్తే వెళ్లింది. అలా వెళ్ల‌డ‌మే ఆమె చేసిన పాపం. బావే క‌దా అని న‌మ్మ‌డ‌మే ఆ యువ‌తి చేసిన నేరం. పెళ్లి చేసుకోవాల్సిన మ‌ర‌ద‌లుని కిరాత‌కంగా చంపేసి చెరువులో ప‌డేశాడా దుర్మార్గుడు. హైద‌రాబాద్‌లోని కూక‌ట్ప‌ల్లిలో జ‌రిగిన సౌమ్య హ‌త్య కేసులో కొత్త కోణం బ‌య‌ట ప‌డింది. ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సౌమ్యకు గత నాలుగేళ్ళ క్రితమే పెళ్ళి అయింది. ఆ త‌ర్వాత‌ భర్తతో విడిపోయి పుట్టింట్లో ఉంటున్న సౌమ్యను బావ అయిన కృష్ణయ్యకు ఇచ్చి వివాహం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు యోచించారు. కాగా… తాను ఇంకా సెటిల్ కాలేదని కృష్ణ చెప్ప‌డంతో అత‌డి కోరిక మేర‌కు వివాహాన్ని వాయిదా వేశారు. ఈలోగా కృష్ణ‌య్య క్యాబ్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తుండ‌గా.. సౌమ్య చింత‌ల్‌లోని ఒక కాలేజీలో డిగ్రీ చ‌దువుతోంది.

ఈ క్రమంలో.. సౌమ్య మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని కృష్ణయ్య గ‌మ‌నించాడు. దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. శుక్ర‌వారం ఉద‌యం మామూలుగా మాట్లాడాలంటూ శుక్రవారం ఉదయం ఆ అమ్మాయిని హెచ్‌ఎంటీ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశానికి రమ్మన్నాడు. ఈ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య వాదోప‌వాదాలు జ‌రిగాయి. అది చివ‌ర‌కు గొడ‌వ‌కు దారి తీసింది. దాంతో నిగ్ర‌హం కోల్పోయిన కృష్ణ‌య్య‌ కోపంతో సౌమ్య‌ను కొట్టాడు. ఆ దెబ్బ బ‌లంగా సౌమ్య‌ను తాక‌డంతో అమె కుప్ప‌కూలిపోయింది. ఆ వెంట‌నే ప్రాణాలు కోల్పోయింది. ఆ త‌ర్వాత నిందితుడు ఆమె మృతదేహాన్ని సంచిలో కట్టుకుని తన వాహనంలో తీసుకువచ్చి కూకట్‌పల్లి ఐడిఎల్‌ చెరువులో పడవేశాడు. అనంతరం పర్వత్‌నగర్‌లోని తన ఇంటికి వెళ్లి సాయంత్రం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *