ఉత్కంఠభరిత మ్యాచ్ లో విజేత సన్‌రైజర్స్‌

కోల్‌కతా నైట్ రైడర్స్ కు సొంత గడ్డపై ఓటమి తప్పలేదు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ గెలుపుతో సన్‌రైజర్స్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించింది. ఐదు వికెట్లతో తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించింది. ఒక ఓవర్ మిగిలుండగానే హైదరాబాద్ సన్‌రైజర్స్ నిర్ణత స్కోర్ సాధించింది. విలియమ్సన్ (50)మ్యాచ్ గెలిపించడానికి అహర్నిశలూ శ్రమించాడని చెప్పాలి.

తొలుత టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అనంతరం 139 పరుగుల టార్గెట్‌‌తో బ్యాటింగ్ దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. విలియమ్సన్‌ 50 (44 బంతులు) అర్ధసెంచరీతో మెరవగా.. వృద్ధిమాన్‌ సాహా(24), షకిబ్‌ అల్‌ హసన్‌(27) రాణించారు. చివర్లో యూసఫ్‌ పఠాన్‌ 17 నాటౌట్‌ (7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ ) చెలరేగి హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు.

చివరి ఆరు ఓవర్లలో మ్యాచ్ గెలిపించడానికి విలియమ్సన్‌, షకీబ్‌ ఫోర్లు, సిక్సర్లు బాదినప్పటికీ ఇద్దరూ ఔటయ్యి వెనుదిరిగారు. ఇంకా ఐదు ఓవర్లు మిగిలుండగానే షకీబ్ పెవిలియన్ చేరాడు. మొత్తం 21 బంతుల్లో 27 పరుగులు చేసిన చావ్లా బౌలింగ్‌లో షకీబ్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. 44 బంతుల్లో 50 పరుగులు చేసి జాన్సన్‌ బౌలింగ్‌లో.. విలియమ్సన్ (18వ ఓవర్లో) ఔటయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *