టిఆర్ఎస్ కి షాక్… ఈ ఎమ్యెల్యే భారతీయత రద్దు

తెలంగాణలోని వేములవాడ ఎమ్యెల్యే చెన్నామనేని రమేష్ కు కేంద్రం షాకిచ్చింది. ఆయన భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేసేసింది. కేంద్ర హోమ్ శాఖ ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఇప్పటికే జర్మనీ పౌరసత్వం ఉందని తేల్చి చెప్పింది.

2014లో టిఆర్ఎస్ తరపున గెలిచిన చెన్నామనేని పై ఆయన ప్రత్యర్థులు కొన్నాళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. జర్మనీ పౌరసత్వం ఉన్న ఆయన భారతీయ పౌరసత్వాన్ని కూడా కొనసాగిస్తూ… ఎమ్యెల్యేగా వుంటున్నారన్నది ఆయనపై అభియోగం. ఈ వ్యవహారంపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. కొన్నాళ్ల క్రితం ఈ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది.

ఆరు నెలల్లోపు చెన్నామనేని పౌరసత్వం పై ఎదోక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ మేరకు కదిలిన కేంద్ర హోమ్ శాఖ ఆయన పౌరసత్వం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని చెన్నమనేని రమేష్‌కు కేంద్రహోంశాఖ లేఖ ద్వారా తెలిపింది. కేంద్రహోంశాఖ నిర్ణయాన్ని సవాల్‌ చేసే యోచనలో చెన్నమనేని ఉన్నట్లు సమాచారం. కేంద్రం నిర్ణయంతో ఆందోళనకు గురైన ఆయన అనుచరులు రమేష్ అనునయించినట్లు సమాచారం. కేంద్రం నిర్ణయాన్ని చెన్నామనేని సుప్రీంలో సవాలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *