తలసాని కారుని గుద్దిన లారీ… వాహనం ధ్వంసం


తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైద్రాబాద్లో ఆయన కారును ఒక లారీ గుద్దేసింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మంత్రి తలసానితో పాటు ఎమ్యెల్యే సుధీర్ రెడ్డి కూడా వున్నారు. ప్రమాదం నుంచి తలసాని క్షేమంగా బయటపడ్డారు. అయితే ఎమ్యెల్యే సుధీర్ రెడ్డి మాత్రం స్వల్పంగా గాయపడ్డారు. వారి వాహనం మాత్రం ధ్వంసం అయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు.

మేడ్చల్ జిల్లా కీసరలో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. తలసాని కారుకు ప్రమాదం జరిగిందన్న వార్త తెలియగానే ఆయన మద్దతుదారులు ఆందోళనకు గురయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *