దారి తప్పిన మంత్రి కాన్వాయ్ నేరుగా ఆ ఇంటికే ఎందుకు వెళ్ళింది..?


మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాన్వాయ్ దారి తప్పింది. నేరుగా వెళ్లి టీడీపీ అధినేత ఇంటి ముందు ఆగింది. కార్లోంచి కిందకు దిగిన తలసానిని అక్కడున్న మీడియా చుట్టుముట్టింది. ఆ వెంటనే తలసాని మాట సర్దుకున్నారు. రోడ్ నో 36 లోకి వెళ్లబోయి ఇటు వచ్చినట్లు చెప్పాడు. ఆ తర్వాత కిమ్మనకుండా కార్ ఎక్కి వెళ్లిపోయారు.

హైద్రాబాద్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెండు రోజులు హైద్రాబాద్లో గడిపేందుకు చంద్రబాబు హైద్రాబాద్ వెళ్లారు. పనిలో పనిగా టీడీపీ తెలంగాణ నేతలతో సమావేశం అయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో సీఎం ఇంటి ముందు సందడి నెలకొంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్ అక్కడ ప్రత్యక్షం అయింది. ఆ కార్ చూసి అక్కడున్న విలేకరులు విస్మయానికి గురయ్యారు.

ఇలా వచ్చారెం అంటూ ఆరా తీశారు. తాను దారి మరి పొరపాటున ఇటు వచ్చానని… చంద్రబాబు ఇంటిలో ఉన్న సంగతి తనకు తెలియదని చెప్పారు. అయితే ఒక మంత్రి కాన్వాయ్ తో ప్రత్యర్థి పార్టీ అధినేత ఇంటికి వస్తే మీడియా ఊరుకుంటుందా. అది ఊరుకున్నా సోషల్ మీడియా కళ్ళు మూసుకుంటుందా. నెవ్వర్. వెంటనే రకరకాల కధనాలు ప్రత్యక్షం అయ్యాయి.

తలసానిని చంద్రబాబు దువ్వేసారని… ఆయన మళ్ళీ పుట్టింటికి వచ్చే అవకాశం ఉందని కధనాలు వెలువడ్డాయి. మరికొంత మంది ఇంకొన్ని ప్రశ్నలు సంధించారు. దారి తప్పిన కాన్వాయ్ నేరుగా టీడీపీ అధినేత ఇంటికే ఎందుకు వెళ్లిందంటూ కొందరు ప్రశ్నలు సంధించారు. సరే వెళ్ళింది పో… మంత్రి అక్కడ కారు దిగి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని కొందరు నిలదీశారు. మొత్తం మీద తలసాని మరోసారి వివాదస్పదం అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *