బెట్టింగ్ బుకీగా టీడీపీ నేత‌… పోలీసులు అదుపులోకి

క్రికెట్ బెట్టింగ్ వ్య‌వ‌హారంలో టీడీపీ నేత లింకులు బ‌య‌ట‌ప‌డ్డాయి. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఈ యువ నేత క‌నుస‌న్న‌ల్లోనే బెట్టింగ్ దందా జోరుగా సాగుతుంద‌ని పోలీసులు గుర్తించారు. గ‌త కొన్ని రోజులుగా నెల్లూరు జిల్లాలో బెట్టింగ్ దందాపై పోలీసులు ప్ర‌త్యేక దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప‌లువురిని పోలీసులు అరెస్టులు కూడా చేశారు. వారు ఇచ్చిన స‌మాచారంతో రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల్లోని బెట్టింగ్ గ్యాంగ్‌ల‌పై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. అలా తీగ లాగుతుండ‌గా పోలీసుల‌కు అధికార పార్టీ నేత అయిన బ్ర‌హ్మ‌నాయుడు గురించి స‌మాచారం ల‌భించించింది.

బెట్టింగ్ మాఫియాలో బ్ర‌హ్మ‌నాయుడు కీల‌క పాత్ర పోషిస్తున్నాడ‌ని నిర్ధారించుకున్న పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం త‌మ అదుపులో ఉన్న బ్ర‌హ్మ‌నాయుడి నుంచి బెట్టింగ్ మాఫియా గురించిన పూర్తి స‌మాచారం సేక‌రించే ప‌నిలో పోలీసులు ఉన్నార‌ని తెలుస్తోంది. జిల్లాలో బెట్టింగ్ మాఫియా గురించి బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత పోలీసులు త‌మ విచార‌ణ‌ను ముమ్మ‌రం చేశారు. ఆ క్ర‌మంలోనే ఈ దందాల‌తో సంబంధం ఉన్న దాదాపు 30 మంది వ‌ర‌కూ ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. వారంద‌రి కోసం విస్తృతంగా గాలింపు చేప‌ట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *