టీడీపీ రాజ‌కీయ వార‌సులు వ‌స్తున్నారు…

సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో సంవ‌త్స‌రంన్న‌ర స‌మ‌యం ఉంది. అయితే ఇప్పుడే రాజ‌కీయాలు వేడెక్కాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అయితే రాజ‌కీయ వార‌సులు తెర‌పైకి వ‌స్తున్నారు. టీడీపీ కొత్త‌త‌రం నేత‌ల‌కు ఆహ్వానం ప‌లికేందుకు సిద్ద‌మ‌వుతోంది. ఇప్ప‌టికే అనంత‌పురం జిల్లాలో ప‌రిటాల ర‌వి వార‌సుడు ప‌రిటాల శ్రీరామ్ రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు.
వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు ప‌వ‌న్‌కుమార్‌రెడ్డి కూడా నాన్న వారసుడిగా ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క భూమిక పోషిస్తున్నాడు. శాస‌న‌స‌భ స్పీక‌ర్ కోడ‌లె శివ‌ప్ర‌సాద్‌రావు కుమారుడు శివ‌రాంప్ర‌సాద్ కూడా శాస‌న‌స‌భ‌లో అడుగుపెట్టాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. అలాగే కృష్ణా జిల్లాలో దేవినేని నెహ్రూ త‌న‌యుడు అవినాష్ కూడా రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. మంత్రి గంటా శ్రీనివాస‌రావు త‌న‌యుడు ర‌వితేజ కూడా రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఆస‌క్తితో ఉన్నార‌ని టాక్‌. అలాగే మ‌రో మంత్రి అయ‌న్న‌పాత్రుడు కుమారుడు విజ‌య్ కూడా ఇప్ప‌టికే చురుకైనా రాజ‌కీయ‌నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల కుమార్తెలు రాజ‌కీయాల‌పై ఆస‌క్తిగా ఉన్నారు. కేంద్ర‌మంత్రి అశోక్‌గ‌జప‌తిరాజుకు కుమార్తె అతిథి ఇప్ప‌టికే తండ్రి వార‌సురాలిగా రాజ‌కీయ కార్య‌క్ర‌మాల్లో క‌నిపిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఆమె ఆస‌క్తిగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఎర్రంనాయుడి కుమార్తె ఆదిరెడ్డి భ‌వానీ కూడా రాజ‌మండ్రి నుంచి శాస‌న‌స‌భ‌లో అడుగుపెట్టాల‌ని భావిస్తున్నారు. మంత్రి నారాయ‌ణ కుమార్తె , సీనియ‌ర్ మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడు త‌న‌య కూడా ఎన్నిక‌ల బ‌రిలో నిలిసేందుకు సై అంటున్న‌ట్లు తెలుస్తోంది. టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , మంత్రి లోకేష్ కూడా ఈ టీమ్‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *