శిల్పాకు అఖిల షాక్‌… ముఖ్య అనుచ‌రుడు జంప్‌!

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో రోజుకో ట్విస్ట్. ఎత్తులు పై ఎత్తులు. ఇప్పుడు టీడీపీ వంతు వ‌చ్చింది. శిల్పా సోద‌రుల‌ను చీల్చామ‌ని ఇక గెలుపు త‌మ‌దేనని సంబ‌ర‌ప‌డుతున్న వైసీపీకి టీడీపీ ఊహించ‌ని షాకిచ్చింది. శిల్పా మోహ‌న్ రెడ్డి నుంచి ఆయ‌న ముఖ్య అనుచ‌ర‌గ‌ణాన్ని త‌మ‌వైపు తిప్పుకోవ‌డంలో తెలుగుదేశం స‌ఫ‌లీకృతం అవుతోంది. శిల్పా సోద‌రులిద్ద‌రూ పోయినా… వారి అనుచ‌రులు, వారితో ఉన్న కార్య‌క‌ర్త‌లు మాత్రం టీడీపీకే క‌ట్టుబ‌డి ఉన్నార‌ని అధికార పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, మైనార్టీ నాయకుడు కరీం టీడీపీలో చేరారు. గత 15 ఏళ్లుగా శిల్పా మోహన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న కరీం నంద్యాల రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈ నెల 3వ తేదీన ఎస్‌పీజీ హైస్కూల్‌ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో జగన్‌ సమక్షంలో శిల్పా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కరీంబైలాంటి వారు తన గెలుపులో కీలకపాత్ర వహించబోతున్నారని చెప్పారు. అలాగే ఇటీవల సీఎం చంద్రబాబు సమక్షంలో నేషనల్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఇంతియాజ్‌ అహమ్మద్‌ ఆ పార్టీలో చేరారు. ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయగలి గేవారిలో ముఖ్యుడైన కరీం నంద్యాల కూరగాయల మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడిగా వందల మంది వర్తకుల నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. ఆయన టీడీపీలో చేరడం శిల్పాకు షాక్‌ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కూరగాయల మార్కెట్‌ షాపుల వేలం పాటల్లో గుడ్‌విల్‌ కేటాయింపుల్లో శిల్పా మోహన్‌రెడ్డి తన వర్గానికి చెందిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ద్వారా రూ.లక్షల్లో భారం పడేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ముఖ్య నాయకులు నంద్యాల కూరగాయల మార్కెట్‌ కార్యవర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు రంగంలోకి దిగింది. నంది గ్రూపు సంస్థల ఎండీ శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమో హన్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, మైనార్టీ నాయకుడు డాక్టర్‌ ఇంతియాజ్‌ అహమ్మద్‌ కరీంని టీడీపీలోకి చేర్చేం దుకు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. దీంతో టీడీపీ వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయి. కూరగా యల మార్కెట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కరీంబైకి కండువా కప్పి మంత్రులు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ప‌రిణామం త‌మ‌కు మ‌రింత బ‌లాన్ని పెంచింద‌ని టీడీపీ నేత‌లు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *