పులి గాండ్రింపుల‌కు పోయిన ప‌న్నెండు ప్రాణాలు

పులి పంజా విసిరితే ఆ దెబ్బ‌కు ప్రాణం పోయినా ఓ అర్థం ఉంటుంది. అదే పులి మీద ప‌డి దాడి చేసి గాయ‌ప‌రిస్తే హ‌డ‌లిపోయి ప్రాణాలు కోల్పోయినా అర్థం వుంటుంది. కానీ పులి గాండ్రింపుల‌కు ప్రాణాలు పోతే… అది కూడా ఒక‌టి రెండు కాదు ఏకంగా ఓ డ‌జ‌ను ప్రాణాలు గాల్లొ క‌లిసిపోతే అది పెద్ద వార్తే. అయితే, ఇక్క‌డ పోయింది మ‌నిషి ప్రాణాలు కాదు… కోతి ప్రాణాలు కావ‌డం మ‌రీ విశేషం.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కొత్వాలీ మ‌హ‌మ్మ‌ద్ ప్రాంతంలో ఒక పులి బీక‌ర‌మైన గాండ్రింపుల‌తో చెల‌రేగింది. ఆ అరుపుల ధాటికి ఆ స‌మీపంలో ఉన్న 12 కోతుల గుండెలు చివురుటాకులా వ‌ణికిపోయాయి. ఆ అదురుతోనే అవి కుప్ప‌కూలిపోయాయి. పులి ఎక్క‌డ త‌న‌పై దాడి చేస్తుందో అన్న క‌ల‌వ‌రంతో అవ‌న్నీ ప్రాణాలు వ‌దిలేశాయి.

ఒక్క‌సారిగా పెద్ద సంఖ్య‌లో కోతులు మ‌ర‌ణించ‌డంతో అట‌వీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. కోతుల మృత‌దేహాల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి పోస్టుమార్టం నిర్వహించారు. అందులో ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌ప‌డింది. కోతుల‌న్నీ పులి గాండ్రిపుల‌కు భ‌య‌ప‌డి మ‌ర‌ణించాయ‌ని వైద్యులు తేల్చారు. అయితే, జంతు ప్రేమికుల వాద‌న మ‌రోలా ఉంది. కోతులు గుంపులుగా మ‌ర‌ణించ‌వ‌ని ఇన్పెక్ష‌న్ సోకి కోతులు మ‌ర‌ణిస్తుంటే దానిని గుర్తించ‌కుండా వైద్యులు గుండెపోటు అంటూ ఏవో కార‌ణాలు చెబుతున్నార‌ని జంతు ప్రేమికుడు డాక్ట‌ర్ బ్రిజేంద్ర సింగ్ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *