గొడుగు నడుపుతున్న రైలును చూస్తారా…!?!

ఆశలు… ఆలోచనలు బుల్లెట్ రైలు మీద. వాస్తవం బొక్కలు పడ్డ ట్రైన్ ఇంజనులో వర్షపు చినుకులు మధ్య డ్రైవింగ్. మన పాలకుల మాటలు బుల్లెట్ రైళ్లు అంటూ ఆకాశంలో విహరిస్తుంటే ఈ డ్రైవర్ మాత్రం వర్షానికి కారుతున్న ఇంజనులో గొడుగు వేసుకుని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.

ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ఇండియన్ రైల్వే పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని ఈ వీడియోనే సాక్షం. మెట్రోరైళ్లతో దూసుకెళ్తున్న మన దేశంలో ఇంకా వర్షానికి తడసిపోయే రైళ్లను చూడాల్సిన దుస్థితి చూడండి. రైల్వే దుస్థితిపై ఈ వీడియోను సుచేతాదలాల్ అనే జర్నలిస్టు ట్వీట్టర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఓ రైలులో డ్రైవర్ వర్షానికి గొడుగు పట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నారు. రైలు ఇంజిన్‌లో ఉన్న కంట్రోల్ ప్యానెల్ తడిసిపోకుండా గొడుగు పట్టుకొని డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న రైలు డ్రైవర్ ప్రత్యేకత ఇదీ.. వర్షపు నీరు రైలు ఇంజిన్‌లో పడకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ అంశంపై రైల్వే అధికారులు స్పందించి రైలు టాప్ రీపేర్ చేయాలని సిబ్బంది కోరుతున్నారు. రైల్వే భద్రతపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్వీట్ చేస్తే సమస్య పరిష్కరించే మన రైల్వే అధికారులు ఇప్పటికైనా ఇలాంటి ఇబ్బందులు తొలగిస్తారో లేదో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *