టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తు… ఇప్పుడిదే హాట్‌టాపిక్‌

టీడీపీ జాతీయ పార్టీ .. రెండు రాష్ర్టాలు త‌న‌కు రెండు క‌ళ్లు అని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెప్పేమాట‌. కానీ ఇప్పుడు ఆయ‌న ఒక కంటికే ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న వార్త‌లు మొద‌ల‌య్యాయి. మ‌రో సంవ‌త్స‌రంలో ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ఎన్నిక‌ల్లో రెండు రాష్ర్టాల్లో పార్టీ అధికారం రావ‌డ‌మే ల‌ల‌క్ష్యంగా ఆయ‌న పావులు క‌దపాలి. కానీ చంద్ర‌బాబు అలా చేయ‌డంలేదు. ఆయ‌న ఒక్క ఏపీమీదే ఫోక‌స్ చేస్తున్నారు. అక్క‌డ అధికారాన్ని నిలుపుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఆ క్ర‌మంలో రెండో క‌న్ను అయిన తెలంగాణ‌ను మ‌ర‌చిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ స‌హా ప‌లు ప్రాంతాల్లో స‌త్తా చాటిన టీడీపీని గాడిలో పెట్టే ప్ర‌య‌త్న‌మే చేయ‌డంలేదు. పూర్తిగా పార్టీని నిర్వీర్యం చేసే కార్య‌క్ర‌మం మొద‌లైన‌ట్లు తెలుస్తోంది.

రేవంత్‌రెడ్డి స‌హా కొంత‌మంది నేత‌లు టీఆర్ ఎస్‌కు ఎదురొడ్డి నిలుస్తున్నారు. కేసీఆర్ ఢీ కొడుతున్నారు. ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌ను ఓడించాల‌న్న ల‌క్ష్యంతో ప‌ని చేస్తున్నారు. కానీ అలాంటి నేత‌ల‌కు మార్గనిర్దేశం చేయాలల్సిన అధిష్టానం ఆ ప‌ని చేయ‌డంలేదు. కానీ ఇప్పుడు కొత్త ప్ర‌చారం మొద‌లైంది. టీఆర్ ఎస్‌తో క‌ల‌సి టీడీపీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంద‌న్న వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. టీడీపీ అధినాయ‌క‌త్వం దానిని ఖండించినా ఆ పార్టీ ఆంత‌ర్యం అదేన‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో తిరుగులేని ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్ ఈసారి విజ‌య‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ తిరుగులేద‌ని భావిస్తున్న ఆ పార్టీ ప‌రిస్థితి న‌ల్లేరు మీద న‌డ‌క చందంగా ఏమీలేదు. కాంగ్రెస్ విజ‌య‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతోంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు టీఆర్ ఎస్ కు బాస‌ట‌గా నిలిచిన కోదండ‌రాం కూడా రివ‌ర్స్ అయ్యారు. ఆయ‌న సొంత పార్టీ పెట్ట‌డ‌మో లేక మ‌రో పార్టీలో చేర‌డ‌మో జ‌రిగేలా ఉంది. అదే జ‌రిగితే త‌మ‌కు కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఉంటుంద‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లోని క‌మ్మ సామాజిక‌వ‌ర్గంపై ఆయ‌న క‌న్నేశారు. నాయ‌కులు లేకున్నా ఇప్ప‌టికీ ఆ సామాజిక వ‌ర్గం టీడీపీ వెంటే ఉంద‌ని టీఆర్ ఎస్ బాస్ న‌మ్ముతున్నారు. అందుకే టీడీపీతో ఆయ‌న పొత్తుకు సై అంటున్నారు. ఆ మేర‌కు చంద్ర‌బాబుకు కూడా సంకేతాలు పంపిన‌ట్లు తెలుస్తోంది. త‌మ పార్టీకి, ఆంధ్రాలోని మంత్రులు, ఎమ్మెల్యేల‌కు తెలంగాణ‌తో ఉన్న సంబంధాల నేప‌థ్యంలలో బాబు కూడా కేసీఆర్ నిర్ణ‌యానికి సానుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం టీఆర్ ఎస్ నేత‌ల‌తో స‌మావేశంలోనూ బాబు న‌ర్మ‌గ‌ర్భంగా ఇదే అంశాన్ని ప్ర‌స్తావించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి పొత్తుల అంశాన్ని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని బాబు చెప్పినా ఆయ‌న మొత్తం మాట‌ల్లోని ఆంత‌ర్యం టీఆర్ ఎస్‌తో క‌ల‌సి న‌డ‌వ‌డ‌మే అన్న‌ట్లుగా ఉంది. దాంతో టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి స‌హా ప‌లువురు ఈ నిర్ణ‌యాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *