టీడీపీ ఎమ్మెల్యే అనితపై చంద్రబాబు వేటు…!

టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్యెల్యే అనితకు ఇచ్చిన పదవిని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనితను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా నియమిస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై వివాదం చెలరేగింది సంగతి తెలిసిందే. అనిత నియామకంపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

తాను క్రిస్టియన్ అంటూ అనిత చెప్పిన వీడియోను ప్రభుత్వం పరిశీలించింది. దీంతో ఎమ్మెల్యే అనిత వ్యవహారంపై సీఎం చంద్రబాబు అధికారులను నివేదిక కోసం ఆదేశించారు. నివేదిక ఆధారంగా అనితపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఎమ్మెల్యే అనితను తొలగిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డులో కాగా టీటీడీ బోర్డులో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఈ వివాదం రేగినపుడే నొచ్చుకున్న అనిత టీటీడీ సభ్యురాలిగా తనను తప్పించాలని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఆమె ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తాను హిందువునేనని, తన కులం ఎస్సీ అని, తిరుమల వేంకటేశ్వరుడు తన ఇష్టదైవమని, పలుమార్లు వెళ్లి దర్శించుకున్నట్లు అనిత ఆ లేఖలో ప్రస్తావించారు. తన ఇష్టదైవాన్ని సేవించుకొనే దిశగా టీటీడీ బోర్డు సభ్యురాలిగా అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

అయితే ఈ విషయంలో కొందరు చేస్తున్న వివాదాలపట్ల తీవ్రంగా మదనపడినట్లు చెప్పారు. ఈ అనవసర వివాదం మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతోనే తనను తప్పించాలని కోరారు. మొన్నామధ్య జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా అనితకు చివరి నిమిషంలో పదవి చేజారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా టీటీడీ పదవి చేతి దాకా వచ్చి చివరకు అండకుండానే పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *