రోజాకు చెక్ పెట్టేందుకు టీడీపీ స‌రికొత్త ఆయుధం

20 నెల‌ల ముందే చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎన్నిక‌లు ఆస్త‌కి రేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే,సినీన‌టి రోజాపై ఒకప్ప‌టి స్టార్ హీరోయిన్ వాణీ విశ్వ‌నాథ్‌ను టీడీపీ పోటీకి నిలుపుతుంద‌న్న వార్త‌తో ఆ నియోజ‌క‌వ‌ర్గంపై తెలుగు రాష్ర్టాల ప్ర‌జ‌ల దృష్టి ప‌డింది. ఇందులో వాస్త‌వ‌మెంత అనే అనుమానాల‌కు వాణీ విశ్వ‌నాథ్ కూడా తెర‌దించారు.తాను సినిమా రంగంలో రాణిస్తాన‌నీ, రాజ‌కీయ నాయ‌కురాలిన‌వుతాన‌ని త‌న తండ్రి చిన్న‌ప్పుడే జోస్యం చెప్పార‌ని అన్నారు.


అది నిజ‌మ‌మ్యే అవ‌కాశం వ‌చ్చింది. త‌న‌కు టీడీపీలో చేరే ఆలోచ‌న ఉంద‌ని చెప్పారు. ఆ పార్టీ సిద్ధాంతాలు త‌న‌కు న‌చ్చాయ‌ని అన్నారు. త‌న‌కు న‌చ్చిన రాజ‌కీయ నాయ‌కుడు చంద్ర‌బాబేన‌ని చెప్పారు. ఆయ‌న గొప్ప‌నాయ‌కుడ‌నీ, ఆయ‌న నాయ‌క‌త్వం కింద ప‌ని చేయాల‌న్న ఆస‌క్తి ఉంద‌ని తెలిపారు. సినిమా న‌టికి త‌న‌కు గుర్తింపు ఇచ్చిన తెలుగు ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి రాజ‌కీయాలే స‌రైన‌న‌వి అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే తాను రోజాకు పోటీగా రాజ‌కీయాల్లోకి రావ‌డంలేద‌ని అన్నారు. న‌గ‌రిలోఆమెను ఎదుర్కోవాల్సి వ‌చ్చినా అందుకు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు. రాజ‌కీయాల్లోనైనా, సినిమాల్లోనైనా బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి ఉంటేనే కిక్క‌ని అన్నారు. ఇప్ప‌టికే కొంత‌మంది టీడీపీ నాయ‌కులు తన‌తో ట‌చ్‌లోకి ఉన్నార‌ని అన్నారు. సినిమాల్లో కూడా ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల్లో న‌టిస్తాన‌ని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *