ఈ సెక్స్ పిచ్చోడు రాత్రిపూట జైల్లో ఆపుకోలేక…

అత్యాచారం కేసులో శిక్షప‌డి జైల్లో ఊస‌లు లెక్క‌బెటుతున్న డేరా బాబా ఓ కామ‌పిశాచి అని తేలింది…! త‌న‌ను తానే శ్రీకృష్ణుడిగా చెప్పుకుంటూ రాస‌లీల‌ను న‌డ‌ప‌డంలో ఆరితేరిపోయాడీ బాబా. సెక్స్‌కు బానిస‌గా మారిన ఇత‌గాడి లీల‌లు చూస్తే ఎవ‌రైనా విస్తుపోవాల్సిందే. 50 ఏళ్ళుపైబ‌డినా కోరిక‌ల యావతో జైల్లో పిచ్చెక్కిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నాడట ఈ డేరాబాబా. అంతే కాదు ఇత‌గాడు జైల్లో చాలా ముభావంగా ఉంటూ, గోడ‌ల‌తో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, అన్నంతినేందుకు కూడా నిరాక‌రిస్తున్నాడ‌ని అధికారులు వైద్యుల‌ను పిలిపించారు. వారు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో అనేక విస్తుగొలిపే నిజాలు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు చెప్పారు. ఇత‌గాడు వైద్య‌బభాష‌లో చెప్పాలంటే సెక్స్ వ్య‌స‌న‌ప‌రుడ‌ని అది లేక‌పోవ‌డంతో ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు తెలిపారు. ఎప్పుడూ శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేసే డేరాబాబా దానికి ఒక్క‌సారిగా దూర‌మ‌వ‌డంతో ఇలా వెర్రెక్కి పోతున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ఇత‌గాడికి గ‌న‌క వెంట‌నే వైద్యం చేయ‌క‌పోతే పిచ్చి మరింత ముదిరిపోతుంద‌ని వైద్యులు చెప్పారు. వీటికి తోడు శృంగారాన్ని మ‌రింత సేపు అనుభ‌వించేందుకు గాను కోట్ల రూపాయ‌లు వెచ్చించి ఆస్ట్రేలియా నుంచి ప్ర‌త్యేకంగా సెక్స్ ఔష‌ధాలు తెప్పించుకుని వాటిని ఎప్పుడూ వాడుతుండేవాడ‌ని ప‌రీక్ష‌ల్లో తేలింది. అలాగే ఒక‌ప్పుడు మ‌ద్యానికి కూడా బానిస‌ని…ఆ త‌ర్వాత దానిని విడిచిపెట్టిన‌ట్టు చెప్పారు. గుర్మీత్ డేరా స‌చ్ఛాలో జ‌రిపిన సోదాల్లో కూడా అనేక లేబుల్ లేని ఔష‌ధాలు దొరికిన సంగ‌తి తెలిసింది. ఇప్పుడు తెలిసిందా…ఈ ఔష‌ధాలు దేనికి వాడేవాడోన‌ని….అలాగే గుఫా (గుహ‌) నుంచి ప్ర‌త్యేకంగా సాధ్వీలు ఉండే చోటుకి సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఎలాంటి కార్య‌క‌లాపాలు జ‌రిపేవాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *