భార్య ఎంబీబీఎస్ సీటు సాధించ‌లేద‌ని…!

మ‌నం క‌లిసి కాపురం చేయాలంటే నువ్వు ఎంబీబీఎస్ సీటు సంపాధించాల‌ని కండిష‌న్ పెట్టాడు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆమెకు సీటు రాక‌పోయే స‌రికి ఆమెను హ‌త‌మార్చి, నిప్పంటించేసాడు ఓ శాడిస్టు భ‌ర్త‌. మ‌హ‌బూబాబాద్ జిల్లా బుద్ధారానికి చెండిన రిషికుమార్ (28) ఖ‌మ్మం జిల్లా ఎర్ర‌గ‌డ్డ తండాకు చెందిన బానోత్ హారిక (20)ను రెండేళ్ళ క్రితం వివాహం చేసుకున్నాడు. వారిద్ద‌రూ బంధువులే…రిషికుమార్‌కు వ‌ర‌క‌ట్నంగా 5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో పాటు రెండెక‌రాల పొలం ఇచ్చారు. హైద‌రాబాద్‌లోని కొత్త‌పేట‌లో ఓ ఐటీ కంపెనీలో ప‌నిచేస్తున్న రిషికుమార్ భార్య‌తో కాపురం పెట్ట‌కుండా 2015లో హారిక‌ను బోడుప్ప‌ల్‌లోని ఓ ప్రైవేటు క‌ళాశాల శిక్ష‌ణా కేంద్రంలో చేర్పించి అక్క‌డే హాస్ట‌ల్‌లో ఉండి చ‌దువుకోవాల‌ని ఏర్పాటు చేశాడు. అంత‌టితో ఆగ‌కుండా క‌చ్ఛితంగా ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవాల‌ని ఆమెను హెచ్చ‌రించేవాడు. సీటు రాక‌పోవ‌డంతో లాంగ్‌ట‌ర్మ్ నీట్ కోచింగ్ కోసం 2016లో నిజాంపేట‌లోని ప్రైవేటు క‌ళాశాల‌లో చేర్చాడు. అయితే ఆమెకు బీడీఎస్ సీటు వ‌చ్చింది. ఇంత ఖ‌ర్చుపెట్టి కోచింగ్ ఇప్పిస్తే ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోలేద‌ని హారిక‌ను భౌతికంగా, మాన‌సికంగా వేధించ‌సాగాడు. నీతో కాపురం చేయ‌ను నీపై ఖ‌ర్చుపెట్టిన డ‌బ్బును మీ పుట్టింటి నుంచి తీసుకుని రా అంటూ హింసించాడు. అంత‌టితో ఆగ‌కుండా ఆమెతో ఈనెల 17న గొడ‌వ‌ప‌డి హ‌త్య చేశాడు. అంతేకాదు ఆ త‌ర్వాత ఆమె ఒంటిపై ట‌ర్పెంటాయిల్ పోసి అంటించేశాడు. హారిక త‌ల్లి పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో వారి కేసు న‌మోదు చేసి రిషికుమార్‌తో పాటు అత‌ని త‌ల్లిదండ్రుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *