మ‌రో మ‌గాడి ప‌క్క‌న భార్య‌ను చూసి… త‌ల నరికి చేత్తో ప‌ట్టుకుని

క‌ట్టుకున్న భార్య‌ను మ‌రో మ‌గాడి ప‌క్క‌న చూసి భ‌రించ‌లేక‌పోయాడా భ‌ర్త‌. ఒక‌టికి నాలుగుసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోని ఆమె తీరుని చూసి ఇక త‌న‌ను తాను నియంత్రించుకోలేక‌పోయాడు. కుటుంబం కోసం దేశం విడిచి వెళ్లి తాను క‌ష్ట‌ప‌డుతుంటే న‌మ్ముకున్న భార్య అక్ర‌మ సంబంధం పెట్టుకుని మోసం చేయడాన్ని స‌హించ‌లేక‌పోయాడా భ‌ర్త. క‌ళ్ల ఎదురుగా మ‌రో మ‌గాడితో బైకుపై పోతున్న భార్య‌ను చూసి త‌ట్టుకోలేక వారిని ప‌ట్టుకుని ఆమె త‌ల న‌రికి నేరుగా పోలీసు స్టేష‌న్‌కు వెళ్లాడు. రాయచోటి సంబేపల్లె మండలం దుద్యాల పంచాయతీ వడ్డెపల్లెకు చెందిన పసుపులేటి వెంకటరమణ(40)కు అదే గ్రామానికి చెందిన రాణి(32)తో 18 ఏళ్ల కిందట వివాహమైంది. కొంత కాలంగా వీరు ఇరువురు అన్యోన్యంగా జీవనం గడుపుతూ వచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి పోషణ భారమైన వెంకటరమణ గల్ఫ్‌కు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ సమయంలోనే పొరుగునే ఉన్న బైనేని దళితవాడకు చెందిన నాగేశ్వరరావుకు రాణెమ్మకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ బంధం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఇది బ‌య‌ట‌ప‌డ‌డంతో బంధువులు ఆమెను హెచ్చరించారు. ఆ సమయంలో పుట్టింటికి వెళ్లిపోయినా పిల్లల జీవితాలు చెడిపోకూడదని నచ్చజెెప్పి తిరిగి వెంకటరమణ ఇంటికి కాపురానికి పంపించారు. అయినా ఆ త‌ర్వాత కూడా ఆమె ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేదు. ఈ తరుణంలోనే ఆమె కుమారులలో ఒకరు అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రియుడి సహకారంతోనే కుమారుడిని హతమార్చిందన్న అనుమానం భర్త వెంకటరమణకు వ‌చ్చింది. అప్పటి నుంచి కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు జ‌రుగుతున్నాయి. కువైట్‌ నుంచి తాను సంపాదించి పంపుతున్న‌ డబ్బులకు లెక్క‌లు సక్రమంగా చెప్పలేదని, చేసిన అప్పులు తీరకపోవడంపై రాణిని పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం లేకపోవడంతో వెంకటరమణ అక్క‌డి నుంచి ఇంటికి వ‌చ్చేశారు.

అప్పటి నుంచి రాణి కదలికలను గ‌మ‌నిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం రాణి తన ప్రియుడు నాగేశ్వరరావుతో కలిసి ద్విచక్ర వాహనంపై గ్రామం నుంచి వెలుపలికి వెళ్తుండగా ర‌మ‌ణ వారిని అనుస‌రించాడు. కొద్ది దూరం వెళ్లాక‌ ఆ వాహనాన్ని అడ్డుకున్నాడు. ఆ సమయంలో ఆమెను వ‌దిలేసి ప్రియుడు బండిపైనే ఉడాయించాడు. దాంతో వెంకటరమణ ఆగ్రహంతో ఊగిపోతూ భార్య రాణిని పంట పొలాల్లోకి తీసుకెళ్లి గొంతు కోసి దారుణంగా చంపేశాడు. అంతటితో ఆగక ఆమె తలను వేరుచేసి సంచిలో పెట్టుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. సంచిలో నుంచి తలను బయటకు తీసి పోలీసుల‌కు చూపించాడు. అక్క‌డున్న పోలీసుల ఈ సీన్ చూసి దిగ్ర్భాంతికి గుర‌య్యారు. వెంట‌నే అత‌డిని అదుపులోకి తీసుకుని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *