దేవుడి పొటో ముందు తాళి క‌ట్టి… రెడేళ్లు కాపురం చేసి…

ప్రేమించి పెళ్లాడిన భ‌ర్త నిలువునా మోసం చేసి… త‌న అక్క కూతురితోనే వైవాహిక బంధం న‌డుపుతూ… ప్ర‌శ్నించిన త‌న‌ను అవ‌మానించ‌డంతో భ‌రించ‌లేక పురుగు మందు తాగేసిన ఇల్లాలి గాథ ఇది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం అమ‌లాపురంలో క‌ల‌క‌లం రేపింది. జిల్లాలోని వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన పొణకల సూర్యచంద్ర కృష్ణకుమారి(27) డిగ్రీ చ‌దివి ఉద్యోగం చేస్తోంది. ఆమె ఉద్యోగం చేస్తున్న ప్రైవేట్ కంపెనీలోనే ప‌రిచ‌యం అయిన చిందాడగరువు గ్రామానికి చెందిన పొణకల నాగేంద్రబాబుతో ప్రేమ‌లో ప‌డింది.

ఆ ప్రేమ కొన్నాళ్లు కొన‌సాగిన త‌ర్వాత 2013లో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఓ అద్దె ఇల్లు తీసుకుని దేవుని పటాల ముందు కృష్ణకుమారి మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది. వారికి బాబు పుట్టాడు. అదే సమయంలో పాలకొల్లులో నాగేంద్రబాబు ఒక మెడిక‌ల్ దుకాణం ప్రారంభించాడు. ఈ స‌మ‌యంలోనే క‌ట్నం కింద‌ రూ.3 లక్షలు తీసుకురావాలని కృష్ణకుమారిని వేధించ‌సాగాడు. చివ‌ర‌కు ఆమె తల్లిదండ్రులు రూ.2 లక్షలు ఇచ్చి బిడ్డ పేరున బ్యాంకులో వేయాలని కోరారు. అయితే, నాగేంద్ర‌బాబు ఆ సొమ్ము సొంత ఖర్చుల‌కు వాడుకున్నాడు.

అలాగే, భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రావ‌డంతో కృష్ణ‌కుమారి ఇటీవ‌ల సెల్‌ఫోన్‌ను ప‌రిశీలించింది. అందులో ఉన్న ఫొటోలు చూసిన ఆమెకు మెద‌డు మొద్దుబారిపోయింది. నాగేంద్ర‌బాబు త‌న అక్క‌కూతురైన సత్య వెంకటసుగ్రీని పెళ్లి చేసుకున్న‌ప్ప‌టి ఫొటోలు అందులో ఉన్నాయి. దీంతో ఆమె భ‌ర్త‌ను నిల‌దీసింది. భార్య త‌న‌ను నిల‌దీయ‌డంతో ఆగ్ర‌హించిన నాగేంద్ర‌బాబు కృష్ణకుమారి, ఆమె బిడ్డను ఇంటినుంచి గెంటేశాడు. దీంతో ఆమె రావులపాడులోని పుట్టింటికి చేరింది. ఈ క్ర‌మంలో ఇరువురి పెద్ద‌లు రాజీ కోసం చ‌ర్చ‌లు జ‌రిపేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఆ స‌మ‌యంలో కృష్ణ‌కుమారిని నాగేంద్ర‌బాబు బంధువులు దుర్బాష‌లాడ‌డంతో ఆమె భ‌రించ‌లేక పురుగు మందు తాగేసింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *